మదిలో భావం
సకలావయవ సంపదతో ఉత్తమమైన మానవజన్మ నిచ్చినందుకు అ పరమాత్మునికి కృతజ్ఞతాంజలులు.
పవిత్రమైన భారతభూమి నా జన్మభూమి. వేదభూమి, కర్మభూమి నా దేశం. పవిత్ర భరతభూమిలో ఉత్కృష్టమైన హిందూమతంలో, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం నా పూర్వజన్మ సుకృతం. ప్రపంచానికి మార్గదర్శి హిందూ మతం నా మతం. వ్యాసుడు, వాల్మెకి, ఆర్యభట్టు, చరకుడు, చాణుక్యుడు, ఆది శంకరచార్యులు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, సాయిబాబా ఇంకా ఎందరో దైవాంశ సంభూతులు ఈ పుణ్యభూమిలో జన్మించి ప్రపంచానికే గురువులైనారు. మన సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం, నమ్మకం ఉన్నాయి. కొంతవరకైనా అనుసరించ కలుగుతున్నందుకు తృప్తిగా అనిపిస్తూంది. మారుతున్న కాలంలో, ఇప్పటి పరిస్థితులలో పూర్వపు ఆచారలని పాటించడం సులభసాధ్యం కాకపోవచ్చు. కానీ వీలున్నంతలో మన దేశ సంస్కృతిని కాపాడుకోవడం, సదాచారాలను పాటించడం మన బాధ్యత.
ఈ కలుషిత భారతావనిలో మార్పు సంభవించి మళ్ళీ మన పుణ్యభూమి మనకు లభిస్తుందని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.
No comments:
Post a Comment