Sunday 21 March 2021

స్నేహ మథురిమ.

 కవితా దినోత్సవ సందర్భంగా నా చిరు కవిత.

స్నేహ మథురిమ.
పలకరింపులోనె పులకరింత కలిగించేది స్నేహం.
ఆత్మీయతను, ఆనందాన్ని పంచి ఇచ్చేది స్నేహం.
కలతపడ్డ మనసును సేద తీర్చేది స్నేహం.
అమ్మ నాన్నతో కూడా పంచుకోలేని సమస్యలకు దారి చూపించేది స్నేహం
అన్నం పెట్టి ఆకలి తీర్చేది స్నేహం.
అర్ధం కాని పాఠాలను మళ్ళీ మళ్ళీ బోధించి ప్రోత్సహించేది స్నేహం
చేసిన మేలుని తిప్పి తిప్పి చూపించి చిన్నబుచ్చనిది స్నేహం.
తప్పొప్పులని లెక్కచేయక ఆదరించేది స్నేహం.
బలహీనతలని ఎత్తి చూపక మంచి దారిని మళ్ళించేది స్నేహం.
నీ వారెవరూ ఆదుకోని తరుణంలో నేనున్నానని అండగా నిలిచేది స్నేహం.
రూపురేఖలకూ, గుణగణాలకూ ప్రాధాన్యత నివ్వనిదే స్నేహం.
చిరునవ్వుతో ఆహ్వానించి ఆదరించి చేరదీసేది స్నేహం.
అచ్చమైన స్వచ్చమైన ఓ స్నేహమా! నీకు జోహార్లు.

No comments:

Post a Comment