Sunday 7 November 2021

ప్రయసఖి

 ప్రియసఖి.

ఆమె  ఊసులు కలిగించును మానసోల్లాసం.

ఆమె నవ్వులు ఎదలో విరిసిన సిరిమల్లెలు

ఆమె లోని ప్రత్యేకత మొగలిరేకు పరిమళం

ఆమె ఉనికి సంపెంగల సువాసన మిళితం.

ఆమె ప్రతి పలుకులో తేనెలొలుకు తియ్యదనం.

ఆమె కళల కాణాచి,  సాటిలేని విదుషీమణి.

ఆమె ప్రతి చర్యా ప్రత్యేకం, అసమానం

ఆమె స్నేహం అద్వితీయం, అపురూపం.

ఆమె సన్నిధిలో అత్యంత ప్రశాంతత.

ఆమె తలపులు మాసిపోని మరువపు సువాసనలు.

ఆమె ఆప్యాయత వెల కట్టలెని పెన్నిధి.

ఆమె అనురాగం తొణికిస్లాడే నవజీవన సారం,

            కలిగించును  నూతనోత్సాహం.

ఆమె సాహచర్యం అత్యంత మాథురీయం.

ఆమె పలకరింపులు హృదయవీణ తంత్రులను

            పలికించే సరిగమలు.

ఆమె నా ప్రియ సఖి, నా నెచ్చెలి.

Thursday 4 November 2021

భానుమతి పాటల గీతమాలిక - 2





నా అభిమాన    కీ. శే. భానుమతి గారు పాడిన కొన్ని పాటలు ఓ గీతమాలికలా ప్రయత్నించాను.గాయ దయచేసి ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


https://www.youtube.com/watch?v=-IKgNEGwItI

బానుమతి పాటల గీత మాలిక.





భానుమతి గీత మాలిక. నాకు నచ్చిన భానుమతి గారి పాటలు కొన్ని ఏరికూర్చి మాలికలా  సమర్పించాను. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వినండి.


ద్గన్యవాదాలు.

Monday 9 August 2021

శరణు శరణు విభీషన వరదా - అన్నమయ్య కీర్తన


 

అన్నమయ్య కీర్తన - చిత్రం సౌజన్యం : శ్రీ పొన్నాడ మూర్తి

శరణు శరణు విభీషణ వరదా
శరధి బంధన రామ సర్వ గుణ స్తోమ
చరణములు
1
మారీచాను బాహు మద మర్ధన
తాటకా హార క్రూరేంద్ర జిత్తుల గుండు గండా
దారుణ కుంభ కర్ణ దనుజ శిరచ్ఛేదక
వీరప్రతాప రామ విజయాభి రామ
2
వాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక
లాలిత వానర బల లంకా పహార
పాలిత సవ నా హల్య పాప విమెాచక
పౌలస్త్య హరణ రామ బహు దివ్య నామ
3
శంకర చాప భంజక జానకీ మనోహర
పంకజాక్ష సాకేత పట్టణాధీశ
అంకిత బిరుదు శ్రీ వేంకటాద్రినివాస
సోంకార రూప రామ పురు సత్య కామ
శ్రీ రామ చంద్రునికి శరణాగతిని వినిపిస్తున్నారు. అన్నమా చార్యుల వారు.

శరధి బంధనా =అంటే సముద్రమును బంధించి దానిపై వారధి గట్టిన వాడని అర్ధం.
పౌలస్త్యహరణ =అంటే రావణాంతక అని అర్ధం
ఉరు సత్యకామ= అంటేశ్రేష్టమైన సత్య వాక్య పరిపాలకుడు.
విభీషణుని అనుగ్రహించిన శ్రీ రామ చంద్రా శరధి బంధన సాగరమును బంధించి సేతువును నిర్మించిన రామా
సర్వ గుణ స్తోమా =(సర్వ గుణముల నిలయా )
శరణు ని న్ను శరణు వేడెదను తండ్రి.

నా చిత్రంతో, డా. ఉమాదేవి ప్రసాదరావు గారి చక్కని వ్యాఖ్యానంతో facebook లో పెట్టిన పోస్ట్ క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు.

కారణాంతరాలవల్ల శ్రీమతి నేను ఈ కీర్తన పాడలేకపోయాను. .

గానం : శ్రీ నాగేశ్వరనాయుడు

వ్యాఖ్యానం : డా. ఉమాదేవి ప్రసాదరావు సంధ్యాల.

Sunday 6 June 2021

మమతానురాగాలు.. కవిత

 

మమతానురాగాలు.

సూదంటురాయిలా హృదయానికి గుచ్చుకొనే నీ చూపులు

అరమోడ్పు కన్నులలో కనిపించె మమతలు

మనశ్శాంతిని దూరం చేసే నీ వయ్యారాల పోకిళ్ళు

మొదటి పరిచయంలోనే ఆకర్షింపచేసుకుని సుస్థిరవాసం ఏర్పరుచుకున్న నెచ్చెలివి

నీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని నీ ఆకాంక్ష.

నీ అభిమతాన్ని నెరవేర్చడమే నా అభిలాష.

నా మీద నీ అలుకలు నాకు అమితానందం.

నీ అలుకలు తీర్చి నిన్ను ఊరడించడమే నాకు పరమానందం

అయినా నాకొక సందేహం, నాపై అలిగే హక్కు నీకెక్కడిదమ్మా..

ఆ.. మరిచాను ఆ చనువు, హక్కు నేనిచ్చినవేగా!

అయినవారికి కూడా లభించని అనునయం, ఆప్యాయత నీకు అందిస్తున్నాను.

నీ మనసు కలవరపడితే అది నాకు తీరని పరితాపం.

నిన్ను క్షోభ పెట్టిన వారిమీద అంతులేని కసి.

నీ పిలుపులోని ఆప్యాయత, అర్ధింపులో స్వతంత్రత కట్టిపడేసే నన్ను.

నీ రచనలు సుదీర్ఘమైనా ఆమూలాగ్రం చదివాక నీ ప్రతిభా పాటవాలకు మాటరాని మౌనినయ్యాను.

నువ్వు నాలోని కళని గుర్తించి స్పందన ఇవ్వలేదని అందరూ అంటున్నా

నాకు మాత్రం నీ మీద అనురాగం మాసిపోదు.అది నీ ప్రత్యేకత.

ఎన్నో అపోహలు, మరెన్నో అపనిందలు అయినా నీ సన్నిహితం నాకు సంతోషం.

చిర స్నేహం..

 

చిర స్నేహం.

 

అలల తాకిడికి విలవిలలాడుతున్న జీవననౌకను దరికి చేర్చేది స్నేహం. సమస్యల సుడిగాలిలో వంగి కృంగిపోతున్న మనోవృక్షానికి ఊతనిచ్చి సేదదీర్చేది స్నేహం. అటువంటి స్నేహానికి ఉన్నత లక్ష్యం తోడైతే స్నేహబంధాలు  పరిపూర్ణత దిశలో పరవళ్ళు తొక్కుతాయి.

అసలైన స్నేహం ఒక్కటే.  కానీ స్నేహం పేరుతో చలామణి అవుతున్న బంధాలు మాత్రం కోకొల్లలు.  ఇంట్లో పని అయింది. కాలక్షేపం  కోసం  పక్కింటికి వెళ్ళి నలుగురితో చేరి నాలుగు కబుర్లు చెప్పుకోవడానికి చేసే స్నేహాలు కాలక్షేప స్నేహాలు.

జీవితంలో వ్యసనాలకి బానిసలైన వాళ్ళు, అటువంటి వ్యసనపరుల సాంగత్యం కోసం, వారి స్నేహం కోసం తహతహలాడుతూ ఉంటారు. అటువంటివి వ్యసనాల స్నేహాలు.

ఆటపాటలు, సినిమాషికార్లు, విహారయాత్రల్లో తమలాంటి అభిరుచులు గలవాళ్ళతో కలిసి విహరించడం కోసం చేసే స్నేహాలు వినోదాల స్నేహాలు.

పలుకుబడి ఉన్నవాళ్ళతో స్నేహం చేస్తే పనులు సాఫీగా సాగిపోతాయని, పలుకుబడి ఉన్నవాళ్ళతో స్నేహాలు పలుకుబడి స్నేహలు.  ఇద్దరికీ ఒకే శత్రువు ఉన్నప్పుడు ఇద్దరు పూర్వశత్రువుల మధ్య స్నేహాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో అవి ఆపద్ధర్మస్నేహాలు.

నీవు లేకపోతే నేనుండలేను, నా ఈ జీవితం నీకే అంకితం అన్న ధోరణిలో ముంద్యుకు సాగే స్నేహాలు యువతీయువకులలో చూస్తాం. పై పై ఆకర్షణలకు, తాత్కాలిక మోహావేశాలకూ లొంగిపోయే ఇటువంటి స్నేహాలు మోహావేశ స్నేహాలు.

హలొ.. హాయ్.. అంటూ సామాజిక మాధ్యమాలలో రోజురోజుకీ పెరిగిపోతున్న స్నేహాలు ఇంటర్నెట్ స్నేహాలు. అధికారలాలసతో దేనికైనా సిద్ధపడేవారి స్నేహాలు, రీతినీ గతినీ అసలు ఊహించలేని స్నేహాలు రాజకీయ స్నేహాలు.

వ్యాపార లావాదేవీలకోసం  ఏర్పడే స్నేహాలు వ్యాపార స్నేహాలు. పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాల పరువు ప్రతిష్ఠల కోసం కొనసాగించే స్నేహాలు, సామాజిక స్నేహాలు.

ఇలా చెప్పుకుంటూ పోతే పైపై స్నేహాలు నానా రకాలు. ఈ రకాల స్నేహాలలో స్వార్ధం అవసరం మాత్రమే మనుష్యులని దగ్గరికి చేరుస్తాయి. అందులో అడంబరం తప్ప ఆత్మీయత ఉండదు. స్వార్ధం తప్ప త్యాగం ఉండదు. నటన తప్ప నిజాయితీ ఉండదు. అటువంటి స్నేహాలు క్షణభంగురాలు. కలవడం ఎంతో విడిపోవడమూ అంతే..


సేకరణ.

 

నిజానిజాలు కవిత

 

నిజానిజాలు.

మెరిసే వలువల వెనుక దాగున్న మాలిన్యం తెలుసుకో..

అందమైన నవ్వు వెనుక దాగున్న ద్వేషాన్ని తెలుసుకో..

ఒలికించే మంచితనం వెనుక దాగున్న కుటిలత్వం తెలుసుకో..

చూపించే నమ్మకం వెనుక దాగున్న వంచనని తెలుసుకో..

కురిపిస్తున్న ప్రేమప్రవాహంలో దాగున్న స్వార్ధబుధ్ధిని తెలుసుకో..

తియ్య తియ్యగా పలికే పలుకుల వెనుక దాగున్న విషాన్ని తెలుసుకో..

అందమైన ఆకృతిలో దాగున్న కపటమైన మనస్సుని తెలుసుకో.

అభివృధ్ధిని చూసి అభినందించే వారిలో దాగున్న అసూయని తెలుసుకో... అంతే కాదు

నిర్మల మనస్కులు, ధనంలో పేద అయినా గుణంలో గొప్పదనం కలవారు కూడా
ఉన్నారని తెలుసుకో.....

మానవమాత్రులం కవిత.

 

మానవమాత్రులం

 

జీవనయానంలో పయనిస్తున్న ఒంటరి బాటసారులం మనం

నేను, నాదను మిథ్యలో కొట్టుమిట్టాడే అజ్ఞానులం మనం.

అణుమాత్రం మనతో రాదని తెలిసినా అన్నీ కావాలనుకునే

తాపత్రయం వదులుకోలేని వారం మనం.

అందరాని వానికోసం ప్రాకులాడి భంగపడే అవివేకులం మనం.

అత్యాశతో ఆరాటపడి ఏదీ అందుకోలేని నిర్భాగ్యులం మనం.

అందిన దానితో తృప్తి చెందక అందనిదానికై చింతించే ఆర్తులం మనం.

అంధకార బంధురంలో చిక్కుకుని వెలుగుకోసం పరితపించే వారం మనం.

పగటికలలు కంటూ, కల్లలైన కలలను చూచి కలతపడి దుఃఖించే

సామాన్యులం మనం.

గడచిన చేదు అనుభవాలను నెమరేసుకుంటూ మిగిలిన జీవన

మాథుర్యాన్ని ఆస్వాదించలేని అభాగ్యులం మనం.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే ఆశాజీవులం మనం.

అన్నింటికీ మూలం మనసేనని తెలిసి, దారి మళ్ళించుకోలేని

దౌర్భాగ్యులం మనం.

పరమాత్ముని సేవలో జీవితాన్ని నిశ్చింతగా, నిర్మోహంగా

సాగించటమే మన ధ్యేయం.

అన్నమయ్య జయంతి వ్యాసం.

 అన్నమయ్య జయంతి వ్యాసం.


అన్నమయ్య.

వైశాఖ పూర్నిమ.. అన్నమయ్య జయంతి.

హరి అవతారమీతడు అన్నమయ్యా
అరయ మా గురుడీతడు అన్నమయ్యా..’

శ్రీ వేంకటేశ్వరానుగ్రహం వల్ల నందవరీక బ్రాహ్మణులు, భారధ్వాజస గోత్రులు
అయిన లక్కమాంబ, నారాయణ సూరి దంపతుల పుణ్యఫలంగా క్రీ..1408 సర్వధారి నామ సంవత్సరం
విశాఖ నక్షత్రంలో వైశాఖపూర్ణిమ నాడు కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో
అన్నమయ్య జన్మించాడు.
అన్నమయ్య తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని కృపతో  జీవిత పర్యంతమూ
32,000
సంకీర్తనలను రచించి పాడిన ధన్యుడు. ప్రాస యతులతో కూడిన అన్నమయ్య
కీర్తనలు రెండు పాదాలు గల పల్లవి. నాలుగు పాదాలు గల మూడు చరణాలు కలిగి
ఉంటాయి. కొన్ని కీర్తనలలో చరణాలు ఎక్కువ ఉంటూ ఉంటాయిసంగీత సాహిత్యాలు
రెండూ సమపాళ్ళలో మేళవింపబడి, పండిత పామరులను ఒకేలా అలరిస్తాయి.
పద కవిత్వం, కవిత్వం కాదని నిరసించే కాలంలో అన్నమయ్య వాటిని రచించి
పదకవితకు ఒక నిర్ధిష్టతనీ, గౌరవాన్నీ కల్పించాడు. పైగా పండితుల కంటే
పామరులను రంజింపజేసి, వారిలో భక్తి భావం కలిగించేందుకు జానపదుల భాషలో
మేలుకొలుపు, ఉగ్గు, గూగూగు, ఏల, జోల, లాలి, ఉయ్యాల, కోలాట. సువ్వి, జాజర
మొదలగు పదాలు చొప్పించి కీర్తనలను రచించాడు. సామెతలు, జాతీయాలను
పొందుపరుస్తూ తేలిక భాషలో సామాన్యులను రంజింపజేస్తూ పండితులను సంతుష్టి
పరచే విధంగా గ్రాంధిక, సంస్కృత భాషల్లో కూడా రచించాడు.
అంతే కాక వైరాగ్య మనస్తత్వాలకు ఇష్టమయ్యే రీతిలో అధ్యాత్మిక కీర్తనలు,
శృంగారప్రియులకు శృంగార కీర్తనలనీ. పిల్లలకనువైన ఆట పాట కీర్తనలనీ,
నిత్యమూ శారీరకంగా అలసిపోయే శ్రమజీవుల కోసం జానపద గేయాలనీ రచించి తరించిన
మహనీయుడు. అందుకే సమాజం లో అన్ని వర్గాల వారికీ నాటికీ నేటికీ కీర్తనలు
ఆనందదాయకాలే..
అన్నమయ్య సంకీర్తనలు వృత్తిపరమైన భాషలో, వారి యాసలో కమ్మరి, కుమ్మరి,
జాలరి మొదలైన అన్ని వృత్తుల వారితో ఆత్మీయంగా మసులుతూ వారి భావంతో
సంకీర్తనలను రచించడం వల్ల వారితో అన్నమయ్యకు గొప్ప అనుబంధం ఏర్పడి వారికి
ఆత్మీయుడయ్యాడు. పల్లెల్లో శ్రమజీవులు పాడుకొనే దంపుళ్ళ పాటలు, అల్లో
నేరెళ్ళు, గొబ్బిళ్ళ పాటలు, తుమ్మెద పదాలు, చిలక పాటలు తందాన పాటలు, హంస
పదాలు. చాంగుభళాలు మొదలైన పదజాలం కూర్చడం వలన అన్నమయ్య కీర్తనలు
ఆబాలగోపాలాన్ని అలరించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నమయ్య స్పృశించని
అంశం లేదంటే అతిశయోక్తి కాదు.



రాముడిదె లోకాభిరాముడితడు.

 

ఈ వారం అన్నమయ్య కీర్తన.

రాముడిదె లోకాభిరాముడితడు
గోమున పరశురాముకోప మార్చెనటరే

యీతడా తాటకిఁ జించె యీపిన్నవాడా
ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె
చేతనే యీకొమారుడా శివునివిల్లు విఱిచె
సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త కదవె

మనకౌసల్యకొడుకా మాయామృగము నేసె
దనుజుల విరాధుని తానే చెఱిచె
తునుమాడె నేడుదాళ్ళు తోడనే వాలి నడచె
యినకులుఁ డితడా యెంతకొత్త చూడరే

యీవయసునుతానే యాయెక్కువజలధి గట్టి
రావణు జంపి సీత మరలఁ దెచ్చెను
శ్రీవేంకటేశుడితడా సిరుల నయోధ్య యేలె
కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే 

 

భావమాథుర్యం..

 

ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీరాముని వీర గాథలు ఉద్ఘాటించెను. అయోధ్యావాసులు తమలో తము శ్రీరాముని శౌర్యమును తలచుకొని ఆశ్చర్యచకితులౌతున్నారు.

శ్రీరాముడితడు. లోకాభిరాముడు. పరశురాముని కోపమును అణగద్రొక్కిన మహాపురుషుడు.

 

ఈతడా బ్రహ్మరాక్షసి తాటకిని సంహరించెను. ఈ చిన్నవాడా సుబాహుని కొట్టి విశ్వామిత్రుని యజ్ఞమును కొనసాగేలా చేసెను. ఈ కుమారుడా శివుని విల్లు విరిచి సీతమ్మను పెండ్లాడెను.. ఈ విషయాలన్నీ వింటుంటే  కొత్తగా ఉంటుంది కదే..

మన కౌసల్య  కొడుకా.. మాయామృగమును చంపి రాక్షసులను మట్టుబెట్టెను. ఏడు తాళవృక్షములను ఒక్క తాటితో బంధించి వాలిని సంహరించెను. ఇనకులుడు ఇతడా? ఎంత వింత చూడరే..

ఈ వయసులో తానే జలధిని బంధించి లంకకు పోయి, రావణుని సంహరించి సీతను క్షేమముగా తిరిగితెచ్చుకొనెను. శ్రీవేంకటేశ్వరుడితడా సిరిసంపదలతో అయోధ్యను పరిపాలించిన అయోధ్యరాముడు. కనుకనే నాటికి నేటికి మనందరికీ కన్నులలో కనిపించే పరదైవము.

జై శ్రీరామ్.. జై హనుమాన్!