కవితా దినోత్సవ సందర్భంగా నా మదిలో భావం.
నీవారెవరో పైవారెవరో ఎన్నటికీ తెలియని తారతమ్యం,
ఎవరికీ అర్ధంకాని ప్రశ్నంటే ఇదేనేమో!
జీవిత పయనంలో ఆటుపోట్లని తట్టుకుంటూ
గమ్యంకోసం వెతుకులాడే బాటసారులం.
మార్గమధ్యంలో కలిసే మిత్రులు కొందరైతే.
అకారణంగా వైరం పెంచుకొనే శత్రువులు కొందరు.
ఒకరి మనసు అనురాగ జలధి అయితే,
మరొకరి అంతరంగం ద్వేషంతో రగిలే అగ్నిగుండం.
స్వల్ప పరిచయంలోనే ఆత్మీయంగా అక్కున చేర్చుకునేవారు కొందరైతే,
సన్నిహితులైన వారే అపార్ధాలతో బంధాల్ని తెంచేసేవారు కొందరు.
జ్ఞాపకాల పొరలలో కనిపించే ఆత్మీయులు కొందరైతే,
చేదుజ్ఞాపకాలలో మరీ మరీ బాధించె వారు కొందరు.
మార్గమధ్యంలో ఎందరినో పోగొట్టుకొని, మరెందరినో పొందుతుంటాం.
ఇదేనేమో జీవిత పయనానికి అర్ధం పరమార్ధం.
No comments:
Post a Comment