Saturday, 25 June 2022

 

భయం భయం..

ఇద్దరు వ్యక్తులు దేనికీ భయపడరు. ఒకరు అన్నీ తెలిసిన జ్ఞాని. ఇంకొకరు పరమమూర్ఖుదు - దేని పర్యవసానం ఏమిటో, ఎలా ఉంటుందో ఆలోచించలేని అవివేకి. మనందరమూ జ్ఞానులమూకాదు, పరమమూర్ఖులమూ కాదు. అందుకే మనలో చాలామందికి భయం అనేది సహవాసి అయి కూర్చుంది. కొందరికి మృత్యు భయం. మరికొందరికి జీవితంలో ఓటమి పాలవుతామేమో అని భయం. ఇంకొందరికి రోగ భయం. తల్లితండ్రులకి పిల్లల భవిష్యత్తు గురించి భయం. ఉద్యోగ భద్రత గురించి భయం. మరికొందరికి ఇప్పుడుసవ్యంగా నడుస్తున్నా, అన్ని కాలాల్లోనూ ఇలాగే ఉంటుందా? భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని భయం. కొందరికి ఉన్న ఆస్తిని ఎవరైనా కాజేస్తారేమోనని భయం. చేసిన తప్పులకి దేవుడు శ్క్షిస్తాడేమోనని భయం, నాయకులకి అధికారం పోతుందేమోనని భయం. ఇలా రకరకాల భయాలు మనల్ని చుట్టుముట్టుతూ ఉంటాయి.ప్రపంచమే భయమయమా అనిపిస్తూ ఉంటుంది.

శ్రీరామకృష్ణప్రభ ఆద్యాత్మిక సంచికనుంచి సేకరణ.. పొన్నాడ ల

 

 

 

 

నాన్నాగారి జ్ఞాపకాలు

 

ఉన్న స్వల్పకాలం మాత్రమే నాన్నగారితొ గడిపిన బాల్యస్మృతులు.

 “నాన్నగారండి” అని నేను పిలిస్తే నా ఆలోచన కనిపెట్టి అదే పంథాలో

 “ఏం నాన్నగారండి ఏమి కావాలి” అని మందహాసంతో అడిగేవారు.

 “నాన్నగారూ మరెమో ఇవాళ ఆదివారం కదండీ. సాయంకాలం బీచ్ కి  తీసుకెల్తారా?. నా స్నేహితులంతా వస్తారుట. అని గారంగా అడిగేసరికి, అలాగేనమ్మా.. ఎండ తగ్గాకవెల్దాం నీ స్నేహితులకి కూడా చెప్పు. అని సంతోషంగా ఒప్పుకునేవారు. సాయంత్రం మమ్మల్ని బీచ్ కి తీసుకివెళ్ళి కాసేపు కెరటాలతో ఆడుకోనిచ్చి, తరువాత మంచి మంచి విషయాలు చెప్పి, పాటలు పాడించి ఇంటికి తీసుకొచ్చేవారు.

 దసరాలకి బొమ్మలకొలువులు పెట్టుకునేవారం. రకరకాల బొమ్మలు మాతో మెట్లమీద అలంకరింపచేసి, చుట్టూ పార్క్ లు కొండలు, గుడిసెలు అట్టలతో, కాయితాలతో అన్నీ తాను అమర్చేవారు. దీపావళికి మందుగుండు సామాను విడివిడిగా తెచ్చి అవన్నీ కలగలిపి, మతాబాలు చిచ్చుబుడ్లు మమ్మల్ని కూర్చోబెట్టి తయారు చేసేవారు. ఎంత సరదాగా ఉండేదో..

 మావిడికాయల కాలంలో దగ్గర ఉన్న కొత్తవలసకి (అక్కడ సంతలో మంచి కాయలు చవకగా దొరుకుతాయి) నాన్నగారితో పాటు వెళ్ళి ఊరగాయలకి రెండుబుట్టల కాయలు, పళ్ళకోసం రెండుబుట్టల కాయలు కొనుక్కుని రైలుబండి లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం.

 పాఠశాలలు తెరిచాక కొత్త పుస్తకాలు కొనడం వాటికి అట్టలు వేయడం, అందంగా నా పేరు వాటి మీద రాయడం అన్నీ నాన్నగారే. నాకు అన్నీ నేర్పిస్తూ మధ్య మధ్య మంచి కథలూ కబుర్లూ చెప్తూ పని పూర్తిచేసేవారు.

 వీధి జాఫిరీ లో కూచొని కొత్త పాట పాడుకుంటూంటే విని “ ఈపాట ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? చాలా బాగుంది అని మెచ్చుకునే నాన్నగారు. ఎప్పుడూ ఆయన చేత దెబ్బలు కానీ, చివాట్లు కానీ తిని ఎరగను. ఒక్క చదువు విషయంలో మాత్రం ఎప్పుడైన కోప్పడేవారు. నన్ను చెల్లినీ మా మామ్మ దగ్గిర  వదిలేసి సెకండ్ షో సినిమాకి అమ్మ నాన్నగారు వెళ్ళిపోతే మర్నాడు అలిగి కూర్చునే దాన్ని. అప్పుడు దగ్గిరకి తీసుకుని ఆ సినీమా ఏడుపు సినిమా అమ్మా! ఒకా మంచి పాట కూడా లేదు. నీకు పాటలంటే ఇష్టం కదా.. మంచి పాటల సినిమా మాయాబజార్ వచ్చింది. దాని నిండా పాటలే దానికి తప్పకుండా వెళ్దాము అని అనునయించేవారు. మంచి సినిమాలు చాలా చూపించారు కూడా..

 ఇంట్లోనే కాదు అటు ఆఫీస్ లోనూ, ఇటు బంధువర్గంలో అందరిదగ్గరా మహనీయులే మా నాన్నగారు. భీముడు బాబాయ్, భీముడు మావయ్య, భీముడన్నయ్య ఇలా అందరి నోళ్ళలోనూ ఆయన పేరే.. మా అమ్మయికి 1987 లో రైల్వే DRM ఆఫిస్ వైజాగ్ లో ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకి ఒక పెద్దాయన దాని సీట్ దగ్గరికి వచ్చి, “నువ్వు భీమేశ్వరరావు మనవరాలివా అమ్మా అని అడిగారు. మీ తాతగారిలాగే మంచి పేరు తెచ్చుకోమ్మా.. అంతటి నిజాయితీపరుడు, శాంతమూర్తి మీ తాతగారవడం నీ భాగ్యం తల్లీ”  అని ఆశీర్వదించి వెళ్ళారుట. ఎవరి తండ్రి వారికి గొప్పే కావొచ్చు. పురుషులందు పుణ్య పురుషుడు మా నాన్నగారు. ఆస్పత్రిలో ఉన్న నాన్నగారిని చూడడానికి వెళితే మృత్యుముఖంలో ఆయన నాతొ మాట్లాడిన చివరి మాట “బాగా చదువుకోమ్మా”..అని. అంతే...

 

 

Saturday, 8 January 2022

ఎన్నడు విజ్ఞానమిక నాకు - అన్నమయ్య కీర్తన - చిత్రం


 


ఎన్నడు విజ్ఞాన మిక నాకు

విన్నపమిదె శ్రీ వేంకటనాథా బాసిన బాయవు (భవ) బంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు | కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు | తచ్చిన తగలవు తహతహలు
రచ్చలు విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటికొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా | సకలము నీవే శరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు ||

Sunday, 7 November 2021

ప్రయసఖి

 ప్రియసఖి.

ఆమె  ఊసులు కలిగించును మానసోల్లాసం.

ఆమె నవ్వులు ఎదలో విరిసిన సిరిమల్లెలు

ఆమె లోని ప్రత్యేకత మొగలిరేకు పరిమళం

ఆమె ఉనికి సంపెంగల సువాసన మిళితం.

ఆమె ప్రతి పలుకులో తేనెలొలుకు తియ్యదనం.

ఆమె కళల కాణాచి,  సాటిలేని విదుషీమణి.

ఆమె ప్రతి చర్యా ప్రత్యేకం, అసమానం

ఆమె స్నేహం అద్వితీయం, అపురూపం.

ఆమె సన్నిధిలో అత్యంత ప్రశాంతత.

ఆమె తలపులు మాసిపోని మరువపు సువాసనలు.

ఆమె ఆప్యాయత వెల కట్టలెని పెన్నిధి.

ఆమె అనురాగం తొణికిస్లాడే నవజీవన సారం,

            కలిగించును  నూతనోత్సాహం.

ఆమె సాహచర్యం అత్యంత మాథురీయం.

ఆమె పలకరింపులు హృదయవీణ తంత్రులను

            పలికించే సరిగమలు.

ఆమె నా ప్రియ సఖి, నా నెచ్చెలి.

Thursday, 4 November 2021

భానుమతి పాటల గీతమాలిక - 2





నా అభిమాన    కీ. శే. భానుమతి గారు పాడిన కొన్ని పాటలు ఓ గీతమాలికలా ప్రయత్నించాను.గాయ దయచేసి ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


https://www.youtube.com/watch?v=-IKgNEGwItI

బానుమతి పాటల గీత మాలిక.





భానుమతి గీత మాలిక. నాకు నచ్చిన భానుమతి గారి పాటలు కొన్ని ఏరికూర్చి మాలికలా  సమర్పించాను. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వినండి.


ద్గన్యవాదాలు.

Monday, 9 August 2021

శరణు శరణు విభీషన వరదా - అన్నమయ్య కీర్తన


 

అన్నమయ్య కీర్తన - చిత్రం సౌజన్యం : శ్రీ పొన్నాడ మూర్తి

శరణు శరణు విభీషణ వరదా
శరధి బంధన రామ సర్వ గుణ స్తోమ
చరణములు
1
మారీచాను బాహు మద మర్ధన
తాటకా హార క్రూరేంద్ర జిత్తుల గుండు గండా
దారుణ కుంభ కర్ణ దనుజ శిరచ్ఛేదక
వీరప్రతాప రామ విజయాభి రామ
2
వాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక
లాలిత వానర బల లంకా పహార
పాలిత సవ నా హల్య పాప విమెాచక
పౌలస్త్య హరణ రామ బహు దివ్య నామ
3
శంకర చాప భంజక జానకీ మనోహర
పంకజాక్ష సాకేత పట్టణాధీశ
అంకిత బిరుదు శ్రీ వేంకటాద్రినివాస
సోంకార రూప రామ పురు సత్య కామ
శ్రీ రామ చంద్రునికి శరణాగతిని వినిపిస్తున్నారు. అన్నమా చార్యుల వారు.

శరధి బంధనా =అంటే సముద్రమును బంధించి దానిపై వారధి గట్టిన వాడని అర్ధం.
పౌలస్త్యహరణ =అంటే రావణాంతక అని అర్ధం
ఉరు సత్యకామ= అంటేశ్రేష్టమైన సత్య వాక్య పరిపాలకుడు.
విభీషణుని అనుగ్రహించిన శ్రీ రామ చంద్రా శరధి బంధన సాగరమును బంధించి సేతువును నిర్మించిన రామా
సర్వ గుణ స్తోమా =(సర్వ గుణముల నిలయా )
శరణు ని న్ను శరణు వేడెదను తండ్రి.

నా చిత్రంతో, డా. ఉమాదేవి ప్రసాదరావు గారి చక్కని వ్యాఖ్యానంతో facebook లో పెట్టిన పోస్ట్ క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు.

కారణాంతరాలవల్ల శ్రీమతి నేను ఈ కీర్తన పాడలేకపోయాను. .

గానం : శ్రీ నాగేశ్వరనాయుడు

వ్యాఖ్యానం : డా. ఉమాదేవి ప్రసాదరావు సంధ్యాల.