భయం భయం..
ఇద్దరు వ్యక్తులు దేనికీ భయపడరు. ఒకరు అన్నీ తెలిసిన
జ్ఞాని. ఇంకొకరు పరమమూర్ఖుదు - దేని పర్యవసానం ఏమిటో, ఎలా ఉంటుందో
ఆలోచించలేని అవివేకి. మనందరమూ జ్ఞానులమూకాదు, పరమమూర్ఖులమూ కాదు. అందుకే మనలో
చాలామందికి భయం అనేది సహవాసి అయి కూర్చుంది. కొందరికి మృత్యు
భయం. మరికొందరికి జీవితంలో ఓటమి పాలవుతామేమో అని భయం. ఇంకొందరికి రోగ భయం.
తల్లితండ్రులకి పిల్లల భవిష్యత్తు గురించి భయం. ఉద్యోగ భద్రత గురించి భయం.
మరికొందరికి ఇప్పుడుసవ్యంగా నడుస్తున్నా, అన్ని కాలాల్లోనూ
ఇలాగే ఉంటుందా? భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని భయం. కొందరికి
ఉన్న ఆస్తిని ఎవరైనా కాజేస్తారేమోనని భయం. చేసిన తప్పులకి దేవుడు
శ్క్షిస్తాడేమోనని భయం, నాయకులకి అధికారం పోతుందేమోనని భయం. ఇలా రకరకాల భయాలు
మనల్ని చుట్టుముట్టుతూ ఉంటాయి.ప్రపంచమే భయమయమా అనిపిస్తూ ఉంటుంది.
శ్రీరామకృష్ణప్రభ ఆద్యాత్మిక
సంచికనుంచి సేకరణ.. పొన్నాడ ల
No comments:
Post a Comment