Monday, 9 August 2021

శరణు శరణు విభీషన వరదా - అన్నమయ్య కీర్తన


 

అన్నమయ్య కీర్తన - చిత్రం సౌజన్యం : శ్రీ పొన్నాడ మూర్తి

శరణు శరణు విభీషణ వరదా
శరధి బంధన రామ సర్వ గుణ స్తోమ
చరణములు
1
మారీచాను బాహు మద మర్ధన
తాటకా హార క్రూరేంద్ర జిత్తుల గుండు గండా
దారుణ కుంభ కర్ణ దనుజ శిరచ్ఛేదక
వీరప్రతాప రామ విజయాభి రామ
2
వాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక
లాలిత వానర బల లంకా పహార
పాలిత సవ నా హల్య పాప విమెాచక
పౌలస్త్య హరణ రామ బహు దివ్య నామ
3
శంకర చాప భంజక జానకీ మనోహర
పంకజాక్ష సాకేత పట్టణాధీశ
అంకిత బిరుదు శ్రీ వేంకటాద్రినివాస
సోంకార రూప రామ పురు సత్య కామ
శ్రీ రామ చంద్రునికి శరణాగతిని వినిపిస్తున్నారు. అన్నమా చార్యుల వారు.

శరధి బంధనా =అంటే సముద్రమును బంధించి దానిపై వారధి గట్టిన వాడని అర్ధం.
పౌలస్త్యహరణ =అంటే రావణాంతక అని అర్ధం
ఉరు సత్యకామ= అంటేశ్రేష్టమైన సత్య వాక్య పరిపాలకుడు.
విభీషణుని అనుగ్రహించిన శ్రీ రామ చంద్రా శరధి బంధన సాగరమును బంధించి సేతువును నిర్మించిన రామా
సర్వ గుణ స్తోమా =(సర్వ గుణముల నిలయా )
శరణు ని న్ను శరణు వేడెదను తండ్రి.

నా చిత్రంతో, డా. ఉమాదేవి ప్రసాదరావు గారి చక్కని వ్యాఖ్యానంతో facebook లో పెట్టిన పోస్ట్ క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు.

కారణాంతరాలవల్ల శ్రీమతి నేను ఈ కీర్తన పాడలేకపోయాను. .

గానం : శ్రీ నాగేశ్వరనాయుడు

వ్యాఖ్యానం : డా. ఉమాదేవి ప్రసాదరావు సంధ్యాల.

No comments:

Post a Comment