Sunday, 6 June 2021

మమతానురాగాలు.. కవిత

 

మమతానురాగాలు.

సూదంటురాయిలా హృదయానికి గుచ్చుకొనే నీ చూపులు

అరమోడ్పు కన్నులలో కనిపించె మమతలు

మనశ్శాంతిని దూరం చేసే నీ వయ్యారాల పోకిళ్ళు

మొదటి పరిచయంలోనే ఆకర్షింపచేసుకుని సుస్థిరవాసం ఏర్పరుచుకున్న నెచ్చెలివి

నీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని నీ ఆకాంక్ష.

నీ అభిమతాన్ని నెరవేర్చడమే నా అభిలాష.

నా మీద నీ అలుకలు నాకు అమితానందం.

నీ అలుకలు తీర్చి నిన్ను ఊరడించడమే నాకు పరమానందం

అయినా నాకొక సందేహం, నాపై అలిగే హక్కు నీకెక్కడిదమ్మా..

ఆ.. మరిచాను ఆ చనువు, హక్కు నేనిచ్చినవేగా!

అయినవారికి కూడా లభించని అనునయం, ఆప్యాయత నీకు అందిస్తున్నాను.

నీ మనసు కలవరపడితే అది నాకు తీరని పరితాపం.

నిన్ను క్షోభ పెట్టిన వారిమీద అంతులేని కసి.

నీ పిలుపులోని ఆప్యాయత, అర్ధింపులో స్వతంత్రత కట్టిపడేసే నన్ను.

నీ రచనలు సుదీర్ఘమైనా ఆమూలాగ్రం చదివాక నీ ప్రతిభా పాటవాలకు మాటరాని మౌనినయ్యాను.

నువ్వు నాలోని కళని గుర్తించి స్పందన ఇవ్వలేదని అందరూ అంటున్నా

నాకు మాత్రం నీ మీద అనురాగం మాసిపోదు.అది నీ ప్రత్యేకత.

ఎన్నో అపోహలు, మరెన్నో అపనిందలు అయినా నీ సన్నిహితం నాకు సంతోషం.

No comments:

Post a Comment