చిర స్నేహం.
అలల తాకిడికి విలవిలలాడుతున్న జీవననౌకను దరికి చేర్చేది స్నేహం.
సమస్యల సుడిగాలిలో వంగి కృంగిపోతున్న మనోవృక్షానికి ఊతనిచ్చి సేదదీర్చేది స్నేహం.
అటువంటి స్నేహానికి ఉన్నత లక్ష్యం తోడైతే స్నేహబంధాలు పరిపూర్ణత దిశలో పరవళ్ళు తొక్కుతాయి.
అసలైన స్నేహం ఒక్కటే. కానీ
స్నేహం పేరుతో చలామణి అవుతున్న బంధాలు మాత్రం కోకొల్లలు. ఇంట్లో పని అయింది. కాలక్షేపం కోసం
పక్కింటికి వెళ్ళి నలుగురితో చేరి నాలుగు కబుర్లు చెప్పుకోవడానికి చేసే
స్నేహాలు కాలక్షేప స్నేహాలు.
జీవితంలో వ్యసనాలకి బానిసలైన వాళ్ళు, అటువంటి వ్యసనపరుల సాంగత్యం
కోసం, వారి స్నేహం కోసం తహతహలాడుతూ ఉంటారు. అటువంటివి వ్యసనాల స్నేహాలు.
ఆటపాటలు, సినిమాషికార్లు, విహారయాత్రల్లో తమలాంటి అభిరుచులు
గలవాళ్ళతో కలిసి విహరించడం కోసం చేసే స్నేహాలు వినోదాల స్నేహాలు.
పలుకుబడి ఉన్నవాళ్ళతో స్నేహం చేస్తే పనులు సాఫీగా సాగిపోతాయని,
పలుకుబడి ఉన్నవాళ్ళతో స్నేహాలు పలుకుబడి స్నేహలు.
ఇద్దరికీ ఒకే శత్రువు ఉన్నప్పుడు ఇద్దరు పూర్వశత్రువుల మధ్య స్నేహాలు
ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో అవి ఆపద్ధర్మస్నేహాలు.
నీవు లేకపోతే నేనుండలేను, నా ఈ జీవితం నీకే అంకితం అన్న ధోరణిలో
ముంద్యుకు సాగే స్నేహాలు యువతీయువకులలో చూస్తాం. పై పై ఆకర్షణలకు, తాత్కాలిక
మోహావేశాలకూ లొంగిపోయే ఇటువంటి స్నేహాలు మోహావేశ స్నేహాలు.
హలొ.. హాయ్.. అంటూ సామాజిక మాధ్యమాలలో రోజురోజుకీ పెరిగిపోతున్న
స్నేహాలు ఇంటర్నెట్ స్నేహాలు. అధికారలాలసతో దేనికైనా సిద్ధపడేవారి స్నేహాలు,
రీతినీ గతినీ అసలు ఊహించలేని స్నేహాలు రాజకీయ స్నేహాలు.
వ్యాపార లావాదేవీలకోసం
ఏర్పడే స్నేహాలు వ్యాపార స్నేహాలు. పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాల పరువు
ప్రతిష్ఠల కోసం కొనసాగించే స్నేహాలు, సామాజిక స్నేహాలు.
ఇలా చెప్పుకుంటూ పోతే పైపై స్నేహాలు నానా రకాలు. ఈ రకాల స్నేహాలలో
స్వార్ధం అవసరం మాత్రమే మనుష్యులని దగ్గరికి చేరుస్తాయి. అందులో అడంబరం తప్ప
ఆత్మీయత ఉండదు. స్వార్ధం తప్ప త్యాగం ఉండదు. నటన తప్ప నిజాయితీ ఉండదు. అటువంటి
స్నేహాలు క్షణభంగురాలు. కలవడం ఎంతో విడిపోవడమూ అంతే..
సేకరణ.
No comments:
Post a Comment