మానవమాత్రులం
జీవనయానంలో పయనిస్తున్న ఒంటరి బాటసారులం మనం
నేను, నాదను మిథ్యలో కొట్టుమిట్టాడే అజ్ఞానులం మనం.
అణుమాత్రం మనతో రాదని తెలిసినా అన్నీ కావాలనుకునే
తాపత్రయం వదులుకోలేని వారం మనం.
అందరాని వానికోసం ప్రాకులాడి భంగపడే అవివేకులం మనం.
అత్యాశతో ఆరాటపడి ఏదీ అందుకోలేని నిర్భాగ్యులం మనం.
అందిన దానితో తృప్తి చెందక అందనిదానికై చింతించే ఆర్తులం మనం.
అంధకార బంధురంలో చిక్కుకుని వెలుగుకోసం పరితపించే వారం మనం.
పగటికలలు కంటూ, కల్లలైన కలలను చూచి కలతపడి దుఃఖించే
సామాన్యులం మనం.
గడచిన చేదు అనుభవాలను నెమరేసుకుంటూ మిగిలిన జీవన
మాథుర్యాన్ని ఆస్వాదించలేని అభాగ్యులం మనం.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే ఆశాజీవులం మనం.
అన్నింటికీ మూలం మనసేనని తెలిసి, దారి మళ్ళించుకోలేని
దౌర్భాగ్యులం మనం.
పరమాత్ముని సేవలో జీవితాన్ని నిశ్చింతగా, నిర్మోహంగా
సాగించటమే మన ధ్యేయం.
No comments:
Post a Comment