పరిదానమిచ్సితే పాలింతువేమో – పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్.
రాగం బిలహరి - 29 మేళకర్త, శంకరాభరణ జన్యం. – మిశ్రజాతి ఝంపెతాళం.
ఆ: స రి గ ప ద స - అ: స ని ద
ప మ గ రి స.
ప. పరిదానమిచ్చితే
పాలింతువేమో !!
అ.ప. పరమపురుష శ్రీపతి నాపై
నీకు
కరుణ గల్గకయున్న-
కారణమేమయ్యా !!
చ. రొక్కమిచ్చుటకు నే –
ముక్కంటి చెలి గాను
చక్కని చెలిని యొసగ –
జనక రాజును గాను.
మిక్కిలి సైన్యమివ్వ –
మర్కటేంద్రుడ గాను
అక్కటిక మెటుగల్గు –
ఆది వెంకటేశ నీకు !!
భావం: నీకు పరిదాన(బహుమానం,
లంచం) మిస్తే నన్ను కరుణిస్తావేమో! పరమపురుషా! శ్రీహరీ! నాపై నీకు కరుణ
కలుగుటలేదు. కారణమేమయ్యా?
ధనమును నీ కిద్దామంటే
నేను కుబేరుడిని కాదు. చక్కని కన్యని ఇద్దామంటే నేను జనక మహారాజును కాను, మిక్కిలి
సైన్యమిద్దామంటే నేను మర్కటేంద్రుడను (సుగ్రీవుడను) కాను ఇంకా నీ అనుగ్రహము నా
కెలా కలుగుతుంది? ఆది వెంకటేశా! (వీరు తమ రచనలను వెంకటేశ ముద్రతో రచించిరి.)
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteబాగున్నది
జిలేబి
ధన్యవాదములు
ReplyDelete