ఈ వారం అన్నమయ్య
కీర్తన.
వెరపించబోయి
తానే వెరె దల్లియశోద
వరచి
ఈ బాలునెట్టు మాని సెంటా నుండెనో.. !!
వెంటరాకుమని
కృష్ణు వెరపించి యసోద
వొంటి
మందలో గొంగ ఉన్నాడనె
అంటి
గొంగ ఎందున్నాడని నోరు దెరిచితే
వెంటలై
బ్రహ్మాండాలు పెక్కుగానవచ్చెను. !!
చందమామ బాడి
తల్లి సరి బొత్తుకు రమ్మంటే
చందురు జూచి
కృష్ణుడు సన్నసేసెను.
ముందర జంద్రుడు
వచ్చి మొక్కితే యశోద చూచి
ముందేలా యంటినోయని
ముంచి విరగంగెను. !!
పాలార్చి
తొట్టెలలో బండబెట్టి యశోద
నీలవర్ణు
దొంగిచూసె నిద్దురోయని
ఓయి శంకచక్రాలతో
నురము శ్రీసతితోడ
ఈలీల శ్రీ
వేంకటేశుడై విన్నాడు. !!
ఈ కీర్తనలో బాలకృష్ణుని
అద్భుతచర్యలు, ఆగడాలు అన్నమయ్య వర్ణిస్తున్నాడు. బాలకృష్ణుని చేష్టలు ఆశ్చర్య జనకాలు,
ఆనందదాయకాలు. ఇవి ఎప్పటికప్పుడు క్రొత్తగా కనిపిస్తాయి.
పిచ్చి యశోద
బాలకృష్ణుని మభ్యపెట్టబొయి తానే మాయలో పడి అయోమయ స్థితిలోకి చేరిపోతుంది. ఈ బాలుడు
మనిషిలా ఎలా ఉన్నాడో అనుకుని ఆశ్చర్యపోయింది.
నావెంట ఆవులమందలోకి
రాకు, మందలో దొంగ ఉన్నాడని కృష్ణుని భయపరచింది. అప్పుడు కృష్ణుడు దొంగ ఎక్కడున్నాడమ్మా
అని నోరు తెరిచెతే బ్రహ్మాడాలు కానవచ్చెను.
యశోద బాలకృష్ణునికి
గోరుముద్దలు తినిపిస్తూ “చందమామ రావే జాబిల్లి రావే” అని పాడుతూ సరిపొత్తుకు చందమామని
పిలిచింది. అప్పుడు కృష్ణుడు చందమామని చూసి చిలిపిగా సైగ చేసాడు. చంద్రుడు దిగి వారి
ముందు వ్రాలాడు. యశోద ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి.
పొట్టనిండా పాలుపట్టి
ఉయ్యాలలో పడుకోబెట్టి యశోద ఊయల ఊచి ఊచి నీలవర్ణుడు నిద్రపోయాడేమో అని తొంచి చూసింది.
అప్పుడు శంకచక్రాలతో, ఉరముపై శ్రీ సతితో ఈ లీల శ్రీ వేంకటేశుడై దర్శనమిచ్చాడు. మళ్ళీ
ఆశ్చర్యపోవడం యశోద వంతయ్యింది.
No comments:
Post a Comment