‘తుఫాన్ ఔర్ దియా’ హిందీ చలన చిత్రం. వి. శాంతారాం గారి దర్శకత్వంలో
వచ్చిన అపూర్వమైన చిత్రం. తుఫాన్ తాకిడికి రెప రెపలాడుతూ తన అస్తిత్వాన్ని
కోల్పోకుండా నిలబడి వెలుగు నిచ్చే చిన్ని దీపాన్ని ప్రేరణగా తీసుకుని,
ఎన్నికష్టాలు వచ్చినా ఎదిరించి ధైర్యంగా నిలబడిన ఒక బాలుని కథ ఈ చిత్రం. కష్టాలకి భయపడే నిరాశావాదులకి మంచి
స్పూర్తినిచ్చే చిత్రం. ‘నిర్బల్ సే లడాయి బలవాన్ కీ ఏ కహానీ హై దియే కి ఔర్
తుఫాన్ కి’ అన్న ఈ పాటని వసంత దేశాయ్ గారి సంగీత పర్యవేక్షణలో మన్నాడే గారు అతి
మధురంగా, ఎంతో ఆర్తిగా ఆలపించారు. భరత్ వ్యాస్ గారి కలం నుండి వెలువడిన అద్భుత
సాహిత్యం. బలవంతులకీ, బలహీనులకి మధ్య జరిగే పోరాటం ఎప్పుడూ ఉండేదే అనే అర్ధంతో
సినిమా ఆద్యంతం ఈ పాట వినిపిస్తూ ఉంటుంది. ఈ పాటలోని సంగీతాన్ని
సాహిత్యాన్ని, మాధుర్యాన్ని ఆస్వాదించండి.
No comments:
Post a Comment