అందరును వినరమ్మఆ మాట అన్నమయ్య కీర్తన.
ఈ వారం అన్నమయ్య కీర్తన:
ప. అందరును వినరమ్మ ఆ మాట
అందాలు చెప్పగవచ్చీ నమ్మరోయమ్మా ||
౧. యీతల నన్ను రమ్మని యేటికి బిలిపించెనో
అతని నడుగరమ్మా ఆ మాట
రాతిరెల్లా జాగారాలే రచ్చకెక్కె బగలెల్లా
చేతలేమి సేయవలె జెప్పరోయ్మ్మా.. ||
౨. పనిలేని పనికేల పంతమిచ్చెనో కాని
అనండా తానావేళ ఆమాట
తనిసే నా మనసెల్లా దలకెక్కె వలపెల్లా
అనుమానా లేమిగల్లా నాడుమనరమ్మా !!
౩. యేకతాన జెప్పెనంటా
ఆకడ నప్పుడే వింటి నామాట
పైకొని శ్రీ వేంకటాద్రిపతి యింతసేసి కూడె
మీకుమీకే యికనైనా మెచ్చుకోరేయమ్మా.. ||
భావమాదుర్యం :
అతడు నన్నెందుకు రమ్మని పిలిచాడో మీరే అతని అడగండమ్మా!అందరూ ఆ మాట వినండి. అమ్మమ్మో! నా అందాల గురించి ఏదో చెబుతాడటమ్మా! అని గట్టిగా అడుగుతున్నది నాయిక. అన్నమయ్య తానూ నాయిక సఖియై ఈ గొడవంతా వింటున్నాడు.
ఇటువైపుకి నన్ను రమ్మని ఎందుకు పిలిచాడో ముందు కనుగొనండి. ఆ మాట ఆయన నోటినుండే విందాము. రాత్రంతా జాగరణే.. పగలంతా వాళ్ళతో వీళ్ళతో నిందలు పడటం నా వంతు అయింది. ఇటువంటప్పుడు నేనేమి చేయాలో మీరే చెప్పండి.
పనిలేని పనియట నా వద్దకు రావటం. మరింత దానికి నాకోసం ఆరాటం ఎందుకు? తానావేళ ఆమాట అన్నాడో లేదో కనుక్కోండి. ఏది ఏమైనా నామనస్సు తృప్తి చెందింది. అతనిపై నాకున్న వలపంతా తలకెక్కింది. తనకేమన్నా అనుమానాలుంటే చెప్పమనండమ్మా.
ఈ మాటలన్నీ నాతొ మాత్రమే ఏకాంతంలో చెబుతానని మిమ్మల్నందరినీ పొమ్మన్నాడు కదా..అప్పుడే నేనామాట విన్నాను. ఇంతా చేసి ఆ శ్రీవేంకటపతి నన్ను కూడినాడు. మీకు మీకే అదీ నచ్చితే, మీరూ ఆయనను మెచ్చుకోండి.
అలమేలు మంగమ్మ అలకలూ, కోపాలూ, నిందలూ అన్నీ తానె చెలికత్తె అయి అనుభూతి చెందుతూ ఇలాంటి కీర్తనలు ఎన్నో అన్నమయ్య రచించాడ