వచన కవిత్వం - ఓ చిన్ని ప్రయత్నం.
Tuesday, 28 February 2023
ఎంతవరకు ఈమనసు
ఆవేదన - కవిత
ఆవేదన.
గుండె పగిలిపోతూంది మనసు మండిపోతూంది.
అమ్మ మనసులో రగులుతున్న అగ్నిపర్వతం.
ఆడపిల్లకు జన్మనివ్వాలంటే భయం భయం
తనంత తాను వలచి, వలపించుకుని వివాహమనే బంధంలో ఇరికించి
నిత్యం నరకం చవి చూపించే మగాడూ మృగమే..
కులం గోత్రం చూసి పెద్దలు కట్టబెట్టిన మొగుడూ మృగమే..
కట్నకానుకలు అందుకుని, భార్యను నమ్మించి
విదేశాలకు ఉడాయించినవాడు ఒకడైతే,
రాక్షస ప్రవృత్తితో మానసిక హింస పెట్టి కట్టుగుడ్డలతో
ఇంటి నుంచి పారిపోయేలా చేసేది ఒకడు.
ఏ రాయి అయినా ఒకటే కదా! అనిపించే పరిస్థితి.
కళకళలాడుతూ పచ్చని గృహిణిగా తిరుగాడవలసిన అమ్మాయి,
ఏ ముద్దుముచ్చట లేక మోడులా మిగిలితే బాధేగా మిగిలేది.
నేర్చుకున్న విద్య జీవనోపాధి కలిగిస్తుందేమో గానీ,
అతరంగంలో సుళ్ళు తిరిగే బాధను తీర్చగలదా?
ఆత్మస్థైర్యంతో చిరునవ్వు మొహాన పులుముకుని
తల్లితండ్రులను మభ్యపెట్టగలవు కానీ, నీ ఆవేదన తీరేదెలా తల్లీ?
ఎవరతను?
ఎవరతను?
Monday, 1 August 2022
ఇల్లాలే ఆధారం - కధ
'ఇల్లాలే ఆధారం' నా గళంలో నేను చదివిన కధ.ఈ క్రింది facebook లింక్ క్లిక్ చేసి చదవండి.
https://www.facebook.com/memories/?source=bookmark
ధన్యవాదాలు
Monday, 11 July 2022
ఆశాజ్యోతి కవిత.
ఆశాజ్యోతి - కవిత..
గూడు చెదిరిపోయింది, గువ్వ మిగిలిపోయింది
ఆశతోకట్టుకున్న ఆశాసౌధం కూలిపోయింది.
ముక్కలయిన హృదయంతో గువ్వ మిగిలిపోయింది.
కోరి వలచిన వాని వికృత హృదయం చూసి ఆవేదనతో
గువ్వ ఒంటరిగా నలిగిపోయింది.
తన ప్రేమను చూసి లోకం పరిహసిస్తుంటే మౌనంగా తలవంచింది.
తన తెలివి, తన ఓర్మి, తన కష్టం అన్నీ దోచుకోబడి
మానసిక హింసకు గురైన గువ్వ మనసు ఘోషించింది.
అన్యాయం, అక్రమం అని ఎలుగెత్తి చాటాలనుకుంది.
అంతలోనే అంతరంగం మేలుకొంది.
తలవంచకు, తలెత్తి నిలబడు. ఆత్మస్థైర్యంతో
అడుగు ముందుకేయమని ప్రభోదించింది.
నిరాశను పారద్రొలి, నిస్పృహను అణగద్రొక్కి ఆత్మవిశ్వాసంతో
అశాజ్యోతిని చేపట్టి గువ్వ అడుగు ముందుకేసింది.
-- పొన్నాడ లక్ష్మి
బాలల దినోత్సవం.
బాలల దినోత్సవం.
పితృహీనులై భవిష్యత్తును కోల్పోయిన నిర్భాగ్య బాలలు
మాతృహీనులై ఆకలికడుపుతో ఆక్రోశించే బాలలు
విద్యాహీనులై, వివేక
శూన్యులై నేరస్థులుగా మారిన బాలలు
జీర్ణవస్త్రాలతో, దీన
వదనాలతో ఆశ్రయం కోసం ఎదురుచూసే బాలలు
అంగవిహీనులై పరాన్నభుక్కులుగా మారిన బాలలు
అవమానాలను భరిస్తూ, చీత్కారాలను
శిరసావహిస్తున్న బాలలు
అమ్మ నాన్నల లాలనకు దూరమై పాఠశాల వసతి గృహాలలో
నిశ్శబ్ధంగా
రోదిస్తున్న బాలలు
పొట్టకూటికై ఎంగిలి
పళ్ళాలు, కాఫీ కప్పులు కడుక్కొనే బాలలు.
వీళ్ళా బాలల పండుగ జరుపుకొనేది? వీళ్ళేనా రేపటి భావి పౌరులు?
మనోవీచిక కవిత
మనోవీచిక
ఆమె ఊసులు
కలిగించును మానసోల్లాసం.
ఆమె నవ్వులు ఎదలో విరిసిన సిరిమల్లెలు
ఆమె లోని ప్రత్యేకత మొగలిరేకు పరిమళం
ఆమె ఉనికి సంపెంగల సువాసన మిళితం.
ఆమె ప్రతి పలుకులో తేనెలొలుకు తియ్యదనం.
ఆమె కళల కాణాచి, సాటిలేని
విదుషీమణి.
ఆమె ప్రతి చర్యా ప్రత్యేకం, అసమానం
ఆమె స్నేహం అద్వితీయం, అపురూపం.
ఆమె సన్నిధిలో అత్యంత ప్రశాంతత.
ఆమె తలపులు మాసిపోని మరువపు సువాసనలు.
ఆమె ఆప్యాయత వెల కట్టలెని పెన్నిధి.
ఆమె అనురాగం తొణికిస్లాడే నవజీవన సారం,
కలిగించును నూతనోత్సాహం.
ఆమె సాహచర్యం అత్యంత మాథురీయం.
ఆమె పలకరింపులు హృదయవీణ తంత్రులను
పలికించే సరిగమలు.
ఆమె నా ప్రియ సఖి, నా నెచ్చెలి.
