సంఘర్షణ.
ఎప్పుడు, ఎక్కడ ఎవరిపై, ఎందుకు కలుగుతుందో చెప్పలేని ఆత్మీయత.
ఆరాధన కావొచ్చు, ఆకర్షణ కావొచ్చు. మంచి స్నేహం కావొచ్చు.
కాంతులు చిందే నీ నగుమోము,
పెదవులపై మెరిసే చిరుదరహాసం
చెప్పకనే చెప్తున్నాయి నీ మదిలో కలిగిన అనురాగాన్ని.
ఆ కన్నులలో మెరుపులూ, మదిలో మెదిలే అలజడులూ
ప్రతిబింబిస్తున్నాయి అంతర్గతంగా నీలో దాగిన మమకారాన్ని.
దాచినా దాగని భావొద్వేగం, అంతరంగంలో ఇముడ్చుకోలేని భావపరంపర.
తలచినంతనే కలిగే మథురానుభూతి,, తనువంతా వింత పులకరింత.
అనుకోకుండా ఏర్పడిన అనుబంధాలు, అరాధనతో ముడివడి
అనురాగాన్ని కురిపించాయి.
ఆత్మీయ పలకరింపులు, ప్రశంశలు,
సంభాషణలు ఆనందానుభూతిని కలిగించాయి.
అంతలోనే ఎందుకో అనుబంధాన్ని, ఆత్మీయతని మరచిపోయి మౌనం వహించాయి.
ముందు కలిగిన మమత, మమకారం ఏమైనట్టో?
కాసేపు మనసు బాధతో మూలిగినా ఈ బంధాలన్నీ అశాశ్వతమనీ,
పవిత్రమైన వివాహబంధం మాత్రమే శాశ్వతం అన్న జీవితసత్యం
పవిత్రమైన వివాహబంధం మాత్రమే శాశ్వతం అన్న జీవితసత్యం
కళ్ళముందు కదిలి మనసు ఊరట చెందింది.
No comments:
Post a Comment