పూటకూళ్ళు – రెస్టారెంట్లు.
క్రీ.శ. 1200 నాటికే
మన పోపుదినుసులు ఇంగ్లిష్ ప్రజల్లో స్టేటస్ సింబల్ గా మారాయి. బ్రెడ్ ముక్కలు మీద
జామ్ పట్టించడం, పోపు దినుసులతో తయారయిన వంటకాలను నంజుకుని తినడం అలవాటు
చేసుకోసాగారు.
క్రీ.శ. 1272 లో
మొట్టమొదటి పూటకూళ్ళ ఇల్లు ఇంగ్లండులో ఏర్పడింది. 1309
నాటికి బ్రిటన్ లో ఇలాంటివి 354 ఏర్పడ్డాయట. 1765 లో
ఫ్రెంచ్ వాళ్ళు రెస్టారెంట్ వ్యవస్తని ప్రారంభించారు. రెస్ట్+రెంట్ అనేవి ఇందులో
ముఖ్యమైనవి.
1600 నాటికే తెలుగు నేలతొ పరిచయాలు పెంచుకున్న ఫ్రెంచ్
వారికి ఇక్కడి పూటకూళ్ళ వ్యవస్తని చూసిన తర్వాతే రెస్టారెంట్ల ఏర్పాటు ఆలోచన
వచ్చిందనడం అతిశయోక్తి కాదు.
అక్కలవాడలు, పూటకూళ్ళ ఇళ్ళు పదమూడవ శతాబ్ది
నాటికే ఇక్కడ ప్రసిద్ది. భోజన సౌకర్యంతో
పాటు “పడక” సౌకర్యం కూడా ఉన్న పూటకూళ్ళ ఇళ్ళు అక్కలవాడలో ఉండేవి. అక్కలవాదల లో ఓ
వంటగత్తె (అందగత్తెని) కుడుర్చుకోనేవారు. “వార్చి వస్తానంటున్నావు-ఎక్కడ
వంటకెల్తున్నావో చెప్పవే వనరుహాక్షి ...” అంటుంది క్రీడాభిరామంలో ఒక పాత్ర.
“పూటకూళ్ళది పుణ్యమునకు జాలదు” అనే రాయలు వాదన ఇక్కడ గమనార్హం.
“అక్షవాటిక అనే సంస్కృత పదం అక్కలవాడగా తెలుగులో మారింది. అక్షవాడు అంటే
మల్లయుద్ధం జరిగే ప్రదేశం. బహుశా ఆనాటి రెస్టారెంట్లు లేదా “మోటల్స్” లో ఇలా జిమ్ సౌకర్యం కూడా ఉండేది కాబోలు.
అరూవాటిక అంటే జూదం, తాగుడు అవకాశాలు ఉన్న “బార్ లాంటిది” ఇవన్నీ అక్కలవాడ లో
లభ్యం.
అనేకమంది అధికారులు, సైనికులు, వ్యాపారులు, రాయబారులు,
విదేశీ సంచారులు వీళ్ళంతా రాచనగరుకు వచ్చినప్పుడు ఈ అక్కవాడలు “అన్ని’ అవసరాలు
తీర్చేవిగా ఉపయోగపడేవి.
రాయలు తన ఆముక్తమాల్యదలో “తద్దినం భోజనం “ పీకలు
దాక తిని అది సరిపోక అక్కలవాడకు వెళ్లి అక్కడ అరకూడు మేక్కినవాడి గురించి
వర్ణిస్తాడు. అరకూడు అంటే అరకొరగా వడ్డించిన ‘ప్లేట్ మీల్స్’ అన్నమాట. అలా సరదాగా
వచ్చి, తిని పోదలచిన వాళ్లకు పూటకూళ్ళు అక్కలవాడలు ఎంతో సహరించేవి.
మొత్తానికి మన పూతాకూళ్ల వ్యవస్తే రెష్టారెంట్లగా
రూపుదిద్దుకున్నాయన్న మాట!
- పొన్నాడ లక్ష్మి
(సేకరణ: ‘శ్రీ కృష్ణదేవరాయ వైభవం’ గ్రంధం’ లో
జీ.వీ. పూర్ణచంద్ గారి వ్యాసం నుండి)
No comments:
Post a Comment