ఇట్టి నా వెర్రితనము లేమని
చెప్పుకొందును ; నెట్టన నిందుకు నగి నీవే దయజూడవే,
పాటించి నాలో నుండి పలికింతువు నీవు – మాటలాడ
నేరుతునంటా మరి నే నహంకరింతును,
నీటున లోకములెల్లా నీవే
యేలుచుండగాను – గాటాన దొరనంటా గర్వింతు నేను. !!
నెమ్మది బ్రజల నెల్లా నేవే
పుట్టించ గాను – కమ్మి నేనే బిడ్డల గంటినంటా సంతసింతును,
సమ్మతి నీవే సర్వ సంపదలు
నొసగ గాను – యిమ్ముల గడించుకొంటి నివి నే నంటా నెంతు !!
మన్నించి ఇహపరాలు మరి నీవే
ఇయ్యగాను ఎన్నుకొని నా తపో మహిమ ఇది యనుచును,
ఉన్నతి శ్రీ వేంకటేశ నన్ను
నేమి చూసేవు అన్నిటా నా యాచార్యు విన్నపమే వినవే !!
భావం:
దేవా! నన్ను
నిమిత్తమాత్రుడుగా నుంచి నీవే నాచే పనులెల్ల చేయించుచున్నావు, కానీ అది నేను
తెలిసికోనలేక వెర్రివాడనై అంతా నా స్వశక్తితో చేయుచున్నానని గర్వించుచున్నాను.
ఇట్టి నా వెర్రితనమునకు నవ్వుకొని నీవే నన్ను దయజూడుమా!
నీవే నాలో నుండి పలు
పలుకులు పలికించుచున్నావు. నేనది గుర్తింపక నేనెంత చక్కగా మాటలాడ నేర్చితినో
చూడండని అహంకరించుచున్నాను. ఈ లోకములనన్ని సమర్దవంతముగా నీవే పరిపాలించుచున్నావు. కానీ నేనే ఈ లోకముల కెల్లా దొరనని
గర్వించుచున్నాను.
జీవులందరినీ పుట్టించు
వాడవు నీవే. కానీ ఈ బిడ్డలను కన్నతండ్రినని మిక్కిలి సంతసించుచున్నాను. నాకున్న
సంపదలన్నీ నీవిచ్చినవే. కానీ వివిధ ఉపాయములతో నేనే ఈ సిరుల నార్జిన్చుకొంటి నని
తలంచుచున్నాను.
నన్ను మన్నించి ఇహపరములు
నీవే ఇచ్చినావు. కానీ నా తపో మహిమ వల్ల వీటిని స్వాధీనము జేసికొంటినని
భావించుచున్నాను. ఓ మహోన్నతుడైన శ్రీ వేంకటేశ్వరా !ఇంత అజ్ఞానముతో విర్రవీగుతున్న నన్నేమి చూసేవు?
కరుణామయుడవైన నీవిది చిత్తములో నుంచుకొనక ఈ దీనుని కాపాడుమని నీతో నా గురుడు చేసిన విన్నపము విని నాపై దయ
చూపుము.
No comments:
Post a Comment