అమ్మొక దారి
నాన్నొక దారి వెతుక్కుంటే,
అమ్మమ్మ పంచన
చేరిన అమాయకపు బాలిక
పది వసంతాలలోనే పరిపూర్ణమైన అనుభవం.
దారి తెన్ను లేని జీవితం,
పది వసంతాలలోనే పరిపూర్ణమైన అనుభవం.
దారి తెన్ను లేని జీవితం,
అంధకారబంధురమైన
భవితవ్యం
ఆప్యాయత తప్ప
కడుపునింపలేని అమ్మమ్మ పేదరికం
ఫలితం ఆసరా
లేని మరొక అమ్మకు, అమ్మమ్మకు దత్తత..
కొత్త ఇంట్లో
కొత్త వాతావరణంలో ఇమడలేని నిస్సహాయత.
కాలగమనంలో
తొలగిన అరమరికలు, ఉప్పొంగిన ఆప్యాయతలు.
తను లేనిదే
అమ్మమ్మకు ఊపిరి లేదు, అమ్మకు నిద్ర రాదు.
అమ్మమ్మకు,
అమ్మకు, మావయ్యకు తలలో నాలుక.
అమ్మ బందువులందరూ
తన్ను అభిమానించే వారే,
ఒకరు అన్న, ఒకరు వదిన, ఒకరు అక్క, ఇంకొకరు బావ.
ఒకరు చదువు చెప్తే, ఇంకొకరు పాటలు నేర్పితే
ఒకరు అన్న, ఒకరు వదిన, ఒకరు అక్క, ఇంకొకరు బావ.
ఒకరు చదువు చెప్తే, ఇంకొకరు పాటలు నేర్పితే
ఆడుతూ పాడుతూ
సాగే జీవనం.
పాఠశాల వదలి,
కళాశాలలో అడుగుపెట్టిన నాడు
రంగుల కలలా
కనిపించే జీవితం, అంతలోనే వక్రించిన విధి.
బాధ్యత నెరిగి, చేదోడుగా మసలి విద్యాబుధ్ధులు నేర్చుతున్న చిట్టితల్లిని
కాన్సెర్
మహమ్మారి తన క్రూరమైన కోరలతో కబళించివేసింది.
బంగారుస్వప్నం చెదరిపోయింది.
అమ్మను, అమ్మమ్మనూ అనాథలను చేసి తరలిపోయింది.
బంగారుస్వప్నం చెదరిపోయింది.
అమ్మను, అమ్మమ్మనూ అనాథలను చేసి తరలిపోయింది.
అతిథిగావచ్చి
అలరించి అందరి మన్ననలను పొంది,
అంతలోనే కనుమరుగయిపోయిన
బంగారు తల్లిని మరచేది ఎలా?
No comments:
Post a Comment