|
అన్నమయ్య ఈ కీర్తనలో పరమాత్ముణ్ణి దొంగగా
అభివర్ణిస్తాడు. ఇందులో అవతారాలన్నీ దాగి ఉన్నాయి.గమనించండి. అన్నమయ్య స్వామిని
ఒకసారి దొంగగా, ఒకసారి నల్లని భూతంగా ఇంకోసారి, భూభారాన్ని మోసే జగన్నదుడుగా
వర్ణిస్తాడు. పరమాత్ముణ్ణి ఎన్ని రకాలుగా
స్తుతించినా, ఏవిధంగా నినదించినా అది అన్నమయ్యకే చెల్లు.
వీడొక వింత దొంగ, వేడిపాలు, వెన్న దొంగలించే
దొంగ.
నీటిలో కాపు వేసి వేదాలని తీసుకున్న దొంగ, తల
కనిపించకుండా దాచుకొనే దొంగ, నేలని తవ్వి తీసుకున్న దొంగ, సందె వేళలో తిరిగేటి
దొంగ.
అడుగుకింద లోకాన్ని అణిచిన దొంగ, తల్లికి
పునర్జన్మ నిచ్చిన దొంగ, అడవిలో
కాపురమున్న దొంగ, నీలిరంగుతో తిరుగాడే దొంగ.
మోసంతో స్త్రీల మానములను హరించిన దొంగ,
రాసికెక్కి గుర్రమును ఎక్కి తిరిగే దొంగ, ఇన్ని వేషాలు వేసి వేంకటగిరిమీద
మూసినముత్యంలా ముదమొందే దొంగ.
No comments:
Post a Comment