శ్రీమద్భాగవతంలో దసమస్కందములోని పద్యం.
శ్రీ కృష్ణుడు కాళీయ మర్దనం చేస్తున్నప్పుడు కాళీయుని
భార్యలు శ్రీ కృష్ణుని నుతిస్తూ చెప్పిన పద్యం.
సి. విశ్వంబు నీవయై విశ్వంబు జూచుచు, విశ్వంబు
సేయుచు విశ్వమునకు
హేతువైన పంచాభూతమాత్రెంద్రియములకు మనఃప్రాణబుద్ది
చిత్త
ముల కెల్ల నాత్మవై మొనసి గుణంబుల నావృత మగుచు
నిజాంశభూత
మగు నాత్మచయమున కనుభూతి సేయుచు మూడహంకృతులచే
ముసుగువడక
తే నెరి
ననంతుడవై దర్సనీయరుచివి, గాక సూక్ష్ముడవై నిర్వికారమహిమ
దనరి కూటస్తుడన సమస్తంబు నెరగు, నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ!
భావం:
ఈ సమస్త విశ్వమూ నీవే. దీన్ని స్మరిస్తూ ఉన్నది
నీవే. ఈ విశ్వంగా ఉండి విశ్వాన్ని చూస్తూ
ఉన్నవాడివి కూడా నీవే. పంచ తన్మాత్రలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం,
ప్రాణం ఉన్నాయని అనుకుంటున్నాం గాని నీవే అన్నిటా ఆవరించబడి ఉన్నావు. నీ అంశగా
నీలో కొంత భాగంగా ఇన్ని ఆత్మలు వర్తిస్తూ ఉంటే, వాటికి అనుభూతి కలిగించేవానిగా
నీవు ఉన్నావు. సత్వరజస్తమనస్సుల రూపంలో మూడు అహంకారాలూ పని చేస్తూ ఉన్నా వాటితో
కప్పబడకుండా అంతులేని ప్రకాశం కలిగి ఉన్నావు. మేము దర్శించడానికి వీలు లేని
సూక్ష్మరూపుదవై ఉన్నావు. ఇన్ని మార్పులూ పొందకుండానే ఇన్నిటిలో దాగి ఉన్నావు కనుక,
ఇన్నిటినీ ఎరుగుదువు. అలాంటి నిర్మలాత్ముడవైన నీకు నమస్కరిస్తున్నాము.
పోతనగారి అనిముత్యాలైన పద్యాలలో ఇది ఒక
ఆణిముత్యం.
No comments:
Post a Comment