Saturday, 13 February 2021

 ఎవరు నాటిన బీజమోగాని,

అది నేలని వదలి
నట్టింట్లో అడ్డుగోడగా మొలకెత్తుతోంది
ఒకే కంచంలో ఇన్నాళ్ళూ తిన్న వాళ్ళం
ఇప్పుడు అమ్మ చేతి గోరుముద్దలకి కూడా
వాటాలు వేసుకోవాలనుకుంటున్నాం
సహస్రాబ్దాలు ఒకటిగా కలిపిన భాషని
విస్మరించి అక్షరాలని కూడా
సమానంగా పంచేసుకోవాలనుకుంటున్నాం
ఆదికవిని , అన్నమయ్యని
కవిసార్వభౌముడిని, కవి తిక్కనని
ఇన్నాళ్ళూ మనవాళ్ళనే అనుకున్నవాళ్ళం
ఇప్పుడు
మీవాడని, మావాడని విడదీసుకుని
టాంక్ బండ్ మీద వారిని కూలద్రోసుకున్నాం
కరచాలనాలు చేసుకుని చాలా ఏళ్ళయింది
పరనిందలు చేసుకోవడంలో నిష్ణాణుతులయ్యాం
పూలగుత్తులు పంచుకున్న వాళ్ళమే
పిడికత్తులు దూసుకుంటున్నాం
పస్తులున్నా సరే పరువు నిలుపుకోవాలని నమ్మేవాళ్ళం
ఇప్పుడు హస్తినలో కుస్తీలకు దిగుతున్నాం
మమ్మల్ని క్షమించండి!
ఇంతకంటే గొప్పగా జీవించడం మాకు తెలియదు
ఎందుకంటే-
రాజకీయ రావణాసురులు నడిపించిన
ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిన ఉన్మాదులం మేము!
కొత్త సరిహద్దు గీసుకోవడానికి
తహతహలాడుతున్న దాయాదులం మేము!
పొన్నాడ ఉమామహేశ్వర రావు
మొబైల్: 09937713474
You, Prabhakar Rao and 2 others
1 comment
1 share
Share

No comments:

Post a Comment