పెండ్లి:
బృందారకానంద మందార మకరంద
బిందునిష్యందాల
విందు పెండ్లి :
రంగారు ముంగారు సరసాంత
రంగాల
సత్యనర్తనము పెండ్లి :
సోగాకన్నులరాణి రాగరంజితపాణి
రాణించు
మాణిక్యవీణ పెండ్లి :
చిన్నారి పొన్నారి చిగురు చెక్కిళ్ళలో
నవ్వులొల్కు
గులాబిపువ్వు పెండ్లి:
ప్రేమతో దేవతలు పెట్టు బిక్ష పెండ్లి :
అక్షయంబైన శ్రీరమరాక్ష పెండ్లి :
వధువు వరుడును “ద్వంద్వ” మై మధువు గ్రోలు
ప్రేమ బృందావనారామసీమ పెండ్లి ::
ఎంతో
మనోహరంగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వివాహ వేడుకను, దాని పరమార్ధాన్ని
అభివర్ణించారు.
ఇంక
నేటి వివాహ వ్యవస్త చూద్దాము. పెళ్లికి ముందు నిశ్చయ తాంబూలాల పేరిట (engagement) ఇంచుమించు పెళ్ళంత హదావుడి, ఖర్చు, అట్టహాసంతో
చేస్తున్నారు. అదయ్యాక పెళ్లి అయ్యేలోపల అమ్మాయి, అబ్బాయి పార్కులు, సినిమాలు,
అర్ధరాత్రిదాకా పార్టీలు, పబ్బులూ ఒకటేమిటి అన్ని ఆనందాలూ ముందే !! పెళ్లికి కళ్యాణమండపాలు, అలంకరణలు, వీడియోలు,
ఫోటోలు, మేకప్పులు, అష్టోత్తర (108 రకాల పదార్ధాలు) విందుల తో అట్టహాసంగా,
ఆర్భాటంగా, అత్యంత వ్యయంతో జరుగుతున్నాయి. కానీ ఆ వివాహబంధం ఎన్నాళ్ళు నిలుస్తుందో నిలకడ లేదు. అమ్మాయిల
ఆభిజాత్యాలు, అబ్బాయిల ఈగోలు అన్నీకలసి అతి త్వరలోనే తగువులు, న్యాయస్థానాలు,
విడాకులు జరిగి కన్నవారికి మనస్తాపాలు కలిగిస్తున్నాయి.
ఓ సినీ కవి వ్రాసిన ఈ పాట (చిత్రం : త్రిశూలం)
వినండి. మళ్ళీ ఆ రోజులు వచ్చేనా..?
https://www.youtube.com/watch?v=w7vlqnfH2us
“పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు”
No comments:
Post a Comment