ఆకలి తెలిసీ అన్నం పెట్టేది, అదనెరిగి ఆగ్రహించేదీ, అనువుగా మందలించేదీ, ఆదర్శంతో తీర్చి దిద్దేదీ తల్లి. అని మహాభారతంలో ఒక విశ్లేషణ,
Saturday, 7 November 2020
తల్లి బాధ్యత.
Sunday, 1 November 2020
విశాఖ ప్రయాణం.
విశాఖ ప్రయాణం.
“అమ్మా! నేను బయల్దేరి వైజాగ్ వస్తున్నాను” చిన్నకూతురు మధు గొంతు
ఫోంలో విన్న భారతికి ఏమీ అంతుపట్టలేదు. అమ్మా! మళ్ళీ చేస్తాను అని ఫోన్
పెట్టేసింది. ఈ విపత్కర పరిస్థితులలో
ఈవిడెందుకు ఇప్పుడు బల్దేరుతూంది అని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. అయిదారు నెలల
నుంచి భుజం నొప్పితో భారతి చాలా బాధపడుతూంది. ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కి
చూపించుకుని ఎక్ష్రేలు, స్కాన్ తీయించుకొంది. భుజం దగ్గిర ఎముక పూర్తిగా
అరిగిపోయిందని, లూస్ బాడీస్ ఉన్నాయి అవి తీసెయ్యాలని, డాక్టర్స్ చెప్పారు. చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరి, పైగా ఈ
వయస్సులో తట్టుకోగలనా అని భయం, అన్నీ కలిసి ఆపరేషన్ కి మొగ్గు చూపట్లేదు. కొడుకు
విజయ్, కూతురు మధు హైదెరబాద్లో ఉంటున్నారు. పెద్ద కూతురు విశాఖపట్నంలో
ఉంటూంది. సంగతంతా తెలిసి కొడుకు, కూతుళ్ళు
ఎలాగైనా ఆపరేషన్ చెయించుకోవాలని పట్టుబడుతున్నారు. నిన్న కొడుకు విజయ్ ఫోన్ లో మాట్లాడి
అమ్మా మేము నీకు సర్జరీ చేయించేస్తాము.
నువ్వు అంత బాధ పడుతుంటే మాకెలా తోస్తుంది. డబ్బుగురించి నువ్వేం అలోచించకు,
నువ్వు ఏం చెప్పినా మేము వినం అని ఖరాఖండిగా అన్నాడు. దాని పరిణామమే మధు రాక
అయ్యుంటుంది అనుకుంటుందగా మళ్ళీ మధు ఫోన్ చేసింది.
అదేమిటే! హఠాత్తుగా ఈ ప్రయాణం? అని ప్రశ్నించింది. “అమ్మా! నువ్వు
చెయ్యి నొప్పితో చాలా బాధ పడుతున్నావని, సర్జరీ అవసరమని అక్క చెప్పింది. అక్కకి
నడుం నొప్పి ఎక్కువగా ఉందట, ఆఫీస్ లో కూడా
సెలవు దొరకట్లేదని, నన్ను రమ్మని చెప్పింది. ఆసుపత్రికి నిన్ను తెసుకెళ్ళడానికి,
పరీక్షలు అవీ చేయించడానికి అవసరాన్ని బట్టి సర్జరి చేయించడానికి రమ్మంటూంది. అందుకే
గోదావరిలో బయల్దేరాను”. అంది. “అది
చెప్పడం నువ్వు బయలుదేరిపోవడం చాలా బాగుందమ్మా! పరిస్థితులెలా ఉన్నాయి రోజు రోజుకీ
కరోనా విజృంభిస్తూంది. ఈ సమయంలో ఎక్కడి వాళ్ళు
అక్కడ ఉండడం శ్రేయస్కరం. తోందరపడి బయల్దేరి
ఇబ్బందులపాలవుతావేమో. అయినా నాదేం ప్రాణం తీసే జబ్బుకాదు. కాస్త
పరిస్థితులు చక్కబడ్డాక అలోచించుకోవచ్చు. అందాకా ఏవో మందులు వాడుతున్నాను కదా!”
అని భారతి అంటుంటే అవతలినుంచి నవ్వులు వినిపించాయి. అప్పుడు మధు “ఇబ్బందుల
పాలవ్వటమేమిటమ్మా? అనేక ప్రమాద పరిస్థితులను దాటుకొని తమ్ముడింటికి ఇప్పుడే
చేరాను. నేను వైజాగ్ దాకా రాలేదు అని చావు
కబురు చల్లగా చెప్పింది. భారతికి ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించింది ఏమిటే నీ
మాటలు సరిగ్గా చెప్పి ఏడు. అంది గాభరా పడుతూ ..
అమ్మా! నువ్వు ఒట్టి గాభర మనిషివి అందుకే నీకు సగం విషయాలు చెప్పం.
ఇబ్బందులన్నీ తప్పించుకుని క్షేమంగా ఇల్లు చేరాను కనుక ఇప్పుడు నీకు ఫోన్ చేసాను
అంది. అసలేం జరిగింది? సరిగ్గా చెప్పు.అంది భారతి.
అక్క దగ్గర్నుంచి ఫోన్ వచ్చాక నేను, తమ్ముడు నీ సమస్య గురించి మాట్లాడుకున్నాము. తమ్ముడు
ఈమధ్యే కొత్త కంపెనీ లో చేరాడు. తనకి సెలవు దొరకడం కష్టమని, నన్ను వెళ్ళమని
అన్నాడు. డబ్బు సంగతి తను చూసుకుంటానని గోదావరి లో టికెట్ బుక్ చేశాడు. మధ్యాహ్నం వచ్చి నన్ను తీసుకుని స్టేషన్ కి
వచ్చాడు. నేను పకడ్బందిగా మాస్క్, గ్లొవ్స్ అన్నీ వేసుకుని తయారయి వచ్చాను, అక్కడి
సిబ్బంది స్టేషన్ లోకి తమ్ముడిని రానివ్వలేదు.నేను సామాను తీసుకుని లోపలికి
వెళ్ళాను. ప్లాట్ ఫామ్ రద్దీగానే ఉంది. స్టేషన్ కి రెండు గంటలు ముందు రావాలని, అందరిని
నిశితంగా పరీక్ష చేసి బండి ఎక్కనిస్తామని రైల్వే వారి ఆదేశం. అలాగే వచ్చాను అక్కడ
ఏవిధమైన పరీక్షలూ లేవు. ట్రైన్ వచ్చేసరికి
జనాలు గుమ్మం దగ్గిర మూగేసారు. కాస్త రద్ది తగ్గాక పెట్టెలోకి ఎక్కాను. అక్కడి
పరిస్థితి చూస్తే తల తిరిగిపోయింది.
అడ్డదిడ్డంగా సామానులు, మనుష్యులు నించుందికి కూడా జాగా లేదు.
ఒక్కళ్ళకీ మాస్క్స్ లేవు. కనీస జాగ్రత్తకూడా పాటించటం లేదు. మీద బెర్త్ నాది.
అందాక కింద కూచుందామంటే కింద బెర్త్స్ రెండింటిలోనూ అనారోగ్యంతో పడుకుని ఉన్న
పెద్దవాళ్ళు ఉన్నారు. చేసేది లేక లగేజ్ కింద సర్ది మీదకి కష్టపడి ఎక్కాను. ఏదో
స్పెషల్ బండిట. మీదని కూడా కూర్చుందికి వీలుగా లేదు. ఈలోపున తమ్ముడి ఫోన్. బండి
ఎక్కవా? జాగ్రత్తగా కూచున్నావా అని ఏం జాగ్రత్తరా బాబూ అని పరిస్థితి వివరించాను.
వాడు వెంటనే గాభరాపడి అక్కా! నువ్వు బండి దిగిపో ఇంటికి వచ్చేద్దువుగాని. నేను
వచ్చి తీసుకెల్తాను. ఆ బండిలో వెళ్ళావంటే కరోనా కచ్చితంగా వచ్చేస్తుంది. నీ ద్వారా
అమ్మ వాళ్ళకి సంక్రమిస్తే బాబోయ్! తలుచుకుంటేనే భయంగా ఉంది. బండి దిగిపో అన్నాడు.
కొంపదీసి దిగిపోయావేమిటే అంది భారతి. చెప్పేది పూర్తిగా వినమ్మా. తమ్ముడు
చెప్పిందే నాకూ నయమనిపించింది. అసలే అనారోగ్యంగా ఉన్న నేను 14 గంటలు ఆ కూపేలో
ప్రయాణిస్తే ఏమైనా జరుగుతుంది. అనుకుని కష్టపడి మీదనుంచి దిగాను. ఈలోపున బండి
కదిలిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసాను. వచ్చే స్టేషన్
మౌలాలిలో దిగిపో నేను వస్తాను అన్నాడు. సామానులు సర్దుకుని జనాల్ని తప్పించుకుని
ద్వారం దగ్గరికి వచ్చేసరికి మౌలాలి కూడా దాటిపోయింది. బండి ఆగలేదు కూడా.. అప్పుడు
మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసాను. ఆ తరువాత స్టేషన్ ఘట్కేసర్ దిగిపో అన్నాడు. తరువాత్
స్టేషన్ లో బండి ఆగలేదు. ఇంక లాభం లేదని చైన్ లాగాను. బండి స్టేషన్ కి కాస్తదూరంలో
ఆగింది. గబ గబా సామాను పట్టుకుని దిగేసాను. చిన్నగా వాన పడుతూంది. ఈలోపున రైల్వే
సిబ్బంది నలుగురు దిగి నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతసేపు పడ్డ టెంషన్ కి
నాకు కాళ్ళు వణకడం మొదలు పెట్టాయి. అయినా వాళ్ళు అడిగిన అన్నింటికీ జవాబు
చెప్పాను. నేను పడ్డ అవస్థంతా చెప్పేను. మీ ఎవరి సలహా అయినా తీసుకుందామంటే మీరెవ్వరూ కనిపించలేదు అన్నాను. మీకు ఇబ్బంది
వస్తుందని మీ పక్కనే కూచుంటామా? అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. నా శారీరిక
పరిస్థితి కూడా వాళ్ళు ఆలోచించ లేదు. నాకు వళ్ళుమండి నేనూ తిక్కగానే సమాధానం
చెప్పి ఏం చేసుకుంటారొ చేసుకోండి నా ఆరోగ్యం బాగులేదు. ఇక్కణ్ణుంచి ఎలాగోలా ఇల్లు
చేరాలి అనుకుని దిగాను. అని గట్టిగా చెప్పేసరికి వాళ్ళు ఏవో రాసుకుని
బండెక్కిపోయారు. బండి కదిలింది.
బ్రతుకుజీవుడా అనుకొని సామాను పట్టుకుని ట్రాక్ పక్కనుంచి వానలో
తడుస్తూ ఒక ఇరవై నిమిషాలు నడిచి స్టేషన్ చేరాను. తీరా చూస్తే అది చర్లపల్లి
స్టేషన్. నిర్మానుష్యంగా ఉంది. అప్పుడు కొంచెం ఆయాసం తీర్చుకుని తమ్ముడికి ఫోన్
చేసాను. వాడు వెంటనే అక్కా నేను అక్కడికే వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు చాలా వాన
పడుతూంది అని జవాబిచ్చాడు. కంగారు పడకు మెల్లిగా రా! వాన పడితే హైదరాబాద్ ఎలా
ఉంటుందో నాకు తెలుసు. అని జవాబిచ్చి బెంచి మీద కూర్చున్నాను. ఈలోపున స్టేషన్
కానిస్టెబుల్ వచ్చి నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. మీరు ఇక్కడ ఎందుకు దిగారు
అంటూ.. వాడికి జవాబు చెప్పాను. ఆఫీస్ రూం కి వచ్చి నే చెప్పినదంతా రాసి సంతకం
పెట్టమన్నాడు. అలాగే చేసాను. వాడు ఒక్కడే స్టేషంలో నేనూ ఒక్కాదాన్నే చీకటి
పడుతూంది, వానకూడా ఎక్కువయింది. మనసుకి ధైర్యం చెప్పుకుని కూర్చున్నాను అరగంట
పొయాక తమ్ముడు వచ్చాడు. అక్కా! ఉన్నావా
తల్లీ నిన్ను చూసిందాకా నా ప్రాణం నిలబడలేదు. పద వెళ్దాం కారులో మాట్లాడుకుందాం
అని చెప్పి సామాను తీసుకుని బయల్దేరాడు. వాణ్ణి చూసాక నాకూ కొంత ఉపశమనం కలిగింది. ఇద్దరం కారులో కూర్చుని హోరుమని వానలో ఇంటివైపు
బయల్దేరాం. దారిలో అంతా వివరంగా చెప్పాను. ఇంటికి చేరేసరికి తమ్ముడి పిల్లలు,
భార్యా అందోళనగా ఎదురు చూస్తూ కనిపించారు.
అందర్నీ పలకరించి లోపలికివచ్చి కాస్త తేరుకుని నీకు ఫోన్ చేసాను. అంది మధు.
కూతురు చెప్పినదంతా వినేసరికి ఒక్కసారి ఒంట్లో వణుకు వచ్చింది
భారతికి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తప్పించుకుంది ఎంత దారుణంగా ఉన్నాయి
రోజులు? చీకటివేళ నిర్మానుష్యమైన
ప్రదేశంలో రైల్వే పట్టాల పక్కనుంచి ఒక్కర్తీ నడుచుకు రావడం, ఎవరైన కనిపెట్టి ఏదైనా
అఘాయిత్యం చేస్తే ఏదీ గతి? ఎంత దారుణం జరిగేది? ఆ వానలో టెంషన్ తో కారు నడిపిన
కోడుకు పరిస్థితి అలోచించినకొద్దీ మనసు వికలమై పోతూంది. కళ్ళ నీళ్ళ
పర్యంతమైంది. తను నమ్ముకున్నా ఆంజనేయ
స్వామే తన పిల్లల్ని కాపాడాడు అనకుని, స్వామికి పదే పదే నమస్కరిస్తూ నిట్టూరుస్తూ
కూర్చుంది. భారతి భర్త వచ్చి, నాకు ఇందాకలే విజయ్ ఫోన్ చేసి చెప్పాడు పరిస్థితి.
మధుని తీసుకు రావడానికి వెళ్తూ నాతో మాట్లాడాడు. అమ్మకి చెప్పకండి కంగారు
పడుతుంది, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు అని చెప్పాడు.. అయితే అంతా
మీకు తెలుసన్నమాట! ఇంతసేపూ మీరు అన్యమనస్కంగా ఉంటే ఏమో అనుకున్నాను. మీ గుండె
నిబ్బరం మెచ్చుకో వచ్చు అని నిష్టూరమాడింది. పోన్లే పిల్లలికి ఏం కాలేదుగా ఇంకా
ఎందుకు బెంగ? పద పడుకో ఇంక. అని అనునయించాడు.
Sunday, 27 September 2020
బాలు - కవిత
Saturday, 29 August 2020
తెలుగు బిడ్డ - కవిత
తెలుగుదేశమందు పుట్టి తెలుగుబిడ్డనని చెప్పి
తెలుగును విస్మరించెదవేల తెలుగుబిడ్డా!మధురమైన తెలుగుభాష దొరలు మెచ్చ్చిన భాష
పొట్టకూటికై ఆంగ్లభాష నేర్చి అమ్మభాషను మరచెదవేల తెలుగుబిడ్డా!
హరికథలు చెప్పి పామరులను సైతం రంజింపచేసిన భాష
బుర్రకథలతో వీరుల చరిత్రలతో వినోదాన్ని అందరికీ పంచిన భాష
అవధాన ప్రక్రియతో ఔరా! అనిపించినా అమృత భాష
పండిత ప్రవచనాలతో విజ్ఞానం పంచిన భాష నీకు చేదయిందా తెలుగు బిడ్డా!
తెలుగు భాషకు మాత్రమే సొంతమయిన ఛందస్సు, గణవిభజన గల పద్యాల సొగసు
తేటతెలుగు భాష గొప్పదనం నీకేల కానరాదు తెలుగు బిడ్డా!
ఆనాటి కవుల సాహీతీ సంపదని, అన్నమయ్య పదకవితల్లోని భావజాలాన్నీ
వాగ్గేయకారకుల కీర్తనల్లోని మధురిమనీ నీవేల ఆస్వాదించలేకపోతున్నావు తెలుగుబిడ్డా!
స్వచ్ఛమైన తెలుగుభాషలో ఆంగ్లపదాలు మేళవించి,
అమృతతుల్యమైన తెలుగుభాషని ఎంగిలిభాష చేయకు తెలుగుబిడ్డా!
అవసరార్ధం పరభాషను నేర్చినా అమ్మ భాషకు తెగులు పట్టించకు తెలుగు బిడ్డా!
Saturday, 15 August 2020
సంసారమే మేలు సకల జనులకు... అన్నమయ్య కీర్తన.
ఈ వారం అన్నమయ్య కీర్తన.
సంసారమే మేలు సకల జనులకు
కంసాంతకుని భక్తి కలిగితే మేలు.
వినయవు మాటల విద్య సాధించితే మేలు
తనిసి యప్పులలోన దాగకుంటే మేలు,
మునుపనే భూమి దన్ను మోచి దించకుంటే మేలు
వెనుకొన్న కోపము విడిచితే మేలు. !!
కోరి నొకరి నడిగి కొంచపడకుంటే మేలు
సారె సారె జీవులను చంపకుంటే మేలు,
భారపుటిడుమలను పడకుండితే చాలు
కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు !!
పరకాంతల భంగపరచకుంటే మేలు
దొరకొని కెళవులు దొక్కకుంటే మేలు
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి
యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు.
భావం… సకల జనులకూ సంసారము మేలే.. సంసారం ఈదుతున్నా భవబంధాలన్నిటిని మోస్తున్నా కంసాంతుకుడైన ఆ హరిని స్మరించడమే మేలు.
వినయంతో కూడిన విద్యను సాధిస్తే మేలు. ఆడంబరాలకు పోయి అప్పుల పాలవకుండా ఉంటే మేలు. లోభం వల్ల అక్రమాలూ, అప్పులూ చేసి భూమికి భారం కాకుండా ఉంటే మేలు. వెన్నంటి ఉన్న కోపాన్ని విడిచితే మేలు.
కోరి ఎవరినీ ఏమీ యాచించి అవమాన పడకుండా ఉంటే మేలు. జీవులను హింసించకుండా ఇతరులను కష్టపెట్టి అనేక కష్టాలను తెచ్చుకోకుండా ఉంటే మేలు. మన చేత బాధింపబడ్డ వారిచే నిందింపబడకుండుటే మేలు.
పరకాంతల నాశించి భంగపడకుండుటే మేలు. దొరకొని ముళ్ళదారులను తొక్కకుంటే మేలు. శ్రీ వేంకటేశ్వరుని నిష్టతో కొలిచి నిశ్చింతుడైతే అన్ని విధాలా మేలు.
గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడంలో తప్పు లేదు కానీ, పరమాత్మునిపై మనస్సు నిలిపి నిష్కామ బుధ్ధితో నీ భాధ్యతలను నిర్వర్తించు అని ఈ కీర్తనలో అన్నమయ్య మనకి వ్యక్తీకరించాడు.
భావోద్వేగం.
ఒక ఆత్మీయురాలి ఆర్తికి నా భావొద్వేగం..
ఆత్మీయతానురాగాలు అంగడిలో సరుకులు కావు
మూల్యం చెల్లించి సొంతం చేసుకోవడానికి,
ఆదరాభిమానాలు తాతముత్తాతల ఆస్తులు కావు
అధికారంతో కబళించి అనుభవించి తృప్తి చెందడానికి,
హృదయాంతరాళలో నుంచి పొంగి పొరలేదే నిజమైన అనురాగం,
అవరోధాలు లేని ప్రేమ విశ్వమంతా వ్యాపించి
తర తమ భేధం లేక అందరికీ పంచబడుతుంది.
ఈ సత్యం తెలుసుకోలేక ఈర్ష్యా అసూయలతో కలసి
అగ్నిగుండంలా మారిన మానసం.
ఒక్కరికే సొంతమవ్వాలనే సంకుచిత భావం.
అంతర్మథనంలో అంతరాత్మ ఘోషిస్తూంది.
అధీనంలో లేని మనసు అపరాధమని తెలిసీ
అంగీకరించడానికి మొరాయిస్తోంది.
సుగుణాలతో బాటు బలహీనతలని కూడా స్వీకరించి
చేరదియ్యాలని ఆత్యాశ!
అత్యాశతో కొట్టుమిట్టాడే మనసుకు
మిగిలేవి కన్నీళ్ళు, కలతలే!
ఒక చిన్న భావ వీచిక.
ఒక చిన్న భావవీచిక.
అద్దాలమేడలు అందమైన కారులు లేవని చింతించా నొకనాడు.
ప్రశాంతమైన చిన్న పొదరిల్లే అంతులేని ఆనందాన్ని ఇస్తోంది ఈ నాడు.
కాలు కింద పెట్టనివ్వక, పువ్వులతో పూజించే భర్త కావాలని
ఊహలలో తేలిపోయానొకనాడు.
మానవత్వంతో అనురాగం పంచుతూ ఆప్యాయంగా చూసుకొనే భాగస్వామి లభించినందుకు సంతృప్తి పొందుతున్నా నీనాడు.
నానాలంకారభూషితనై నలుగురిలో మెప్పు పొందాలని అనుకున్ననొకనాడు
కాసంత బొట్టుతో, నల్లపూసల సౌభాగ్యంతో అత్యంత గౌరవం
పొందుతున్నానీనాడు.
ఉన్నతవిద్యలనభ్యసించి అందరిలా ఖండాంతరాలకు పిల్లలు పోలేదని
నిరాశ చెందానొకనాడు.
చెంతనే ఉండి అనవరతం నా బాగోగులు విచారిస్తూ బాధ్యతగా మసులుకొనే
సంతతిని చూసి గర్విస్తున్నాను ఈనాడు.
Monday, 27 July 2020
అన్నమయ్య కీర్తనలలో స్త్రీ పురుష సమానత్వం.
Sunday, 5 July 2020
తానే తానే ఇందరి గురుడు - అన్నమయ్య కీర్తన
Sunday, 14 June 2020
మానసవింగం కవిత.
కవిత..మానస విహంగం.
మానస విహంగం అందని జాబిల్లి కోసం అర్రులు చాస్తూ పరుగులు తీస్తోంది.
భావోద్వేగాలను, భావపరంపరలనూ అదుపులో పెట్టమని అంతరాత్మ ఘోషిస్తూంది
పలితకేశాలు, సడలిన దేహం తన ఉనికికి అద్దం పడుతున్నా, రంగుల పొహళింపుతో
తిరిగిరాని అందమైన రూపుకోసం విశ్వప్రయత్నం చేస్తూంది.
వయస్సు దేహనికే కాని మనసుకు లేదని వింతగా సమర్ధించుకుంటూంది.
ఎంత మెరుగులు దిద్దినా అరవైలో ఇరవైని పొందలేమని సమ్మతించలేకపోతూంది.
మళ్ళుతున్న వయసుని, చేజారిపోతున్న కాలాన్ని తలచి తలచి కృంగిపోతూంది.
పిచ్చి మనసా! అసంభవాన్ని సంభవం చెయ్యాలన్న ఆలోచనెందుకు?
మారుతున్న కాలాన్ని సంతోషంగా స్వీకరించి, జీవిత చరమాంకలోని
అనుభూతుల్ని ఆస్వాదిస్తూ జీవించు ప్రశాంతిగా!
Sunday, 17 May 2020
ప్రేమ సుధ.
నీ తలపే నాకు దివ్యానుభూతి..
Sunday, 10 May 2020
అమ్మ.
అరవిరిసిన బాల్యానికి సాక్షి అమ్మ
బ్రహ్మాదులు కూదా కొలవలేని ఆప్యాయతే అమ్మ
తప్పటడుగులను సరిదిద్దే గురురూపిణి అమ్మ
గూడుకట్టుకున్న బాధను తీర్చే అమృతస్వరూపిణి ఆమ్మ
కలబోసిన ఆప్యాయత అమ్మ
సృష్టిస్థితిలయకారిణి అమ్మ
ఎమీ ఆశించని ప్రేమమూర్తి అమ్మ
వడుగువృద్ధురాలయినా తరగని సౌందర్య పెన్నిధి అమ్మ
ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేని రుణమే అమ్మ
ఎన్ని చెప్పినా ఎదో మిగిలిపోయిన మాటే అమ్మ
అలసిపొయినా చెరగని చిరునవ్వు అమ్మ
చిట్టిగోరుముద్దలు తినిపించే అమృతహస్తమే అమ్మ
సన్యాసి కూడా వందనం చేసే విగ్రహమే అమ్మ
శివునికి బాల్యం రుచిచూపించిన నిగ్రహమే అమ్మ
త్రిమూర్తులను బాలులను చేసిన ఆత్మబలమే అమ్మ
ఇంటికి నిండుదనమయిన రూపమే అమ్మ
తన ప్రాణాన్నే పాలుగా మార్చిన అమృతమాధుర్యం అమ్మ
దిగ్దంతాలు వ్యాపించిన సుగందభరితమయిన పరిమళం అమ్మ
Sunday, 19 April 2020
ఇందిర వడ్డించ అన్నమయ్య కీర్తన..
చిందక యిట్లే భుజించవో స్వామి
పెక్కైన సయిదంపు పేణులను
సక్కెర రాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామీ
గూరలు కమ్మని కురలను
సారంపు పచ్చళ్ళు చవులుగనిట్టే
కూరిమితో చేకొనవే స్వామీ
మెండైన పాకాలు మెచ్చి మెచ్చి
కొండల పొడవు కోరిదివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ
శ్రీ వేంకటాచలపతికి ఆరగింపు సేవ సంకీర్తన ఇది. ఇందిరాదేవి ప్రేమతో కొసరి కొసరి విస్తరిలో వడ్డిసుందిట. ప్రక్కనే నిలబడి అన్నమయ్య ఇలా అంటున్నాడు.
చారిత్రక దృష్టితో పరిశీలిస్తే 15వ శతాబ్ధంలో ఈ వంటకాలు స్వామికి నిత్యం నివేదించేవారేమో!
Friday, 28 February 2020
వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి భారత రామయణాలై పరగె నీ కధలు ॥ - అన్నమయ్య కీర్తన
Friday, 7 February 2020
నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము. - అన్నమయ్య కీర్తన
ధరించుటే నా స్నానము,
ధరపై నీ నిజదాసుల
చరణధూళి నా స్నానము.
తలచుటే నా స్నానము
వలనుగ నిను గనువారల శ్రీపాద
జలములే నా స్నానము..
దరిసనమే నా స్నానము.
తిరువెంకటగిరి దేవా..
కథాస్మరణమే నా స్నానము...
Saturday, 1 February 2020
ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య.. కదిసితేనే ఇనుము కనకమై మించెను. !! - అన్నమయ్య కీర్తన
కదిసితేనే ఇనుము కనకమై మించెను. !!
వెలసెను నాలోని వేడుకలెల్లా
చెలిమిచేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపుల పంటలెల్లాఁ బండెను !!
వుప్పతిల్లెజవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించు తమకపుకొటారులు నిండెను. !!
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
ఈరీతి శ్రీ వేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నా కిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను. !!
ఓ శృంగారరాయా! నీ మహిమలను ఏమని పొగడెదమయ్యా! పరిశీలించి చూస్తే ఇనుములాంటి అల్పులైన నాబోంట్లు కనకములాగ ప్రకాశిస్తారు.
నీవు మథురమైన చిరునవ్వులు చిందిస్తే మనసులోని పెనుచీకట్లు తొలగిపోతాయి. నాలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చెలిమితో నీవు నాపై చేయి వేస్తే నా వలపుల పంట పండుతుంది.
నీవు నన్ను నఖశిఖపర్యంతం చూస్తే నా శరీరమంతా పులకరించి నా యౌవ్వనం ఒక్కసారిగా అతిశయిస్తుంది. నీవు అనురాగంతో నా శిరోజాలను నిమురుతూ నాకు చిన్న నఖక్షతము చేస్తే తమకంతో తబ్బిబ్బవుతాను.
నీవు నన్ను ప్రేమతో పలుకరిస్తే సిగ్గులమొగ్గనై ఒక మూల ఒదిగిపోతాను. నా మోములో కళలు తాండవిస్తాయి. ఓ వేంకటేశ్వరా! నీవు అన్నివిధాలుగా నన్నేలితివి. నన్ను వెలకట్టలేని రత్నముగా మలచేవు. నా మదన సామ్రాజ్యము నీ కృప వల్ల అతిశయించినది.
అణుమాత్రపుదేహి నంతే నేను మొణిగెద లేచెద ముందర గానను - అన్నమయ్య కీర్తన
మొణిగెద లేచెద ముందర గానను
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా! ॥అణుమాత్రపు॥
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?॥ అణుమాత్రపు॥
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా? ॥ అణుమాత్రపు॥