Wednesday 29 April 2015

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు ఏవి తల్లీ....



మహాకవి శ్రీశ్రీ కి  ఘన నివాళి.  హ్రుదయాన్ని కదిలించే వారి అద్భుత కవిత వినండి.

శ్రీకృష్ణ బలరాముల విద్యాభ్యాసం









శ్రీ మద్భాగవతం దశమస్కందం  :  శ్రీ కృష్ణ బలరాముల విద్యాభ్యాసం.
గాయత్రీ దీక్ష తరువాత కృష్ణబలరాములు సాందీపనిముని వద్దకు విద్యాభ్యాసమునకు వెళ్ళినారు. కృష్ణ బలరాముల భక్తి శ్రద్ధలను, నియమనిష్టలనూ చూచి  సంతుష్టుడై వేదరహస్యాలనూ, ఉపనిషత్తులనూ బోధించాడు. క్షత్రియులు కనుక యుద్ధవిద్య, రాజనీతిలో కూడా శిక్షణ ఇవ్వబడింది.  

అంతేకాక సంగీత సాహిత్యాలు, చిత్రలేఖనం, పుష్పాలంకరణ,గృహాలంకరణ, వాస్తు శాస్త్రము మొదలగు చతుషష్టి కళలనూ అభ్యసించారు. నాటకరంగములో వస్త్రాలంకరణ, కేశాలంకరణ,మొగమునకు చందనమూ మొదలగు పూతలుపూసి అందంగా అలంకరించడం(అంటే ఇప్పటి beautician  course అన్నమాట) ఇలా ఎన్నోవిద్యలను నేర్చుకున్నారు.  బహురూపి కళను నేర్చుకున్నారు. ఈ కళలో సన్నిహితులు కూడా గుర్తించ లేనట్లుగా వేషధారణ చేయగలుగుతారు. అంతే కాక మనస్తత్వ శాస్త్రం, ఇంద్రజాలం, వశీకరణ విద్య మొదలగు విద్యలన్నీ అభ్యసించారు.

పోడుపుకధలల్లడం,  గడి నుడి నుడి కట్టులో పదాలను నింపడం కూడా నేర్చుకున్నారు. వివిధ దేశాల  భాషలు నేర్చుకోవడమే గాక, శ్రీ కృష్ణుడు  జంతువులతో, పక్షులతో కూడా మాట్లాడేవాడు. గోస్వాముల విరచితమైన వైష్ణవ  సాహిత్యంలో దీనికి నిదర్సనం కూడా కనిపిస్తుందిట. ఇంకా ఎన్నో ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన విద్యలూ, కళలూ అతి స్వల్పకాలంలో నేర్చుకుని తమగురువుని సంత్రుప్తిపరిచారు.
ఈ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న కళలన్నీ (beautician course, magician course, psychology, hypnotism, wall paintng, vaastu, crossword pujjle, house decoration etc.) కొన్నివేల సంవత్సరాల క్రితం కృష్ణుడు
అభ్యసించాడంటే అద్భుతంగా లేదూ...!!!

Monday 27 April 2015

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ



''అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ" - ఎప్పుడో ఒకప్పుడు అమ్మాయి అత్తారింటికి వెళ్ళల్సిందే. కనిపెంచిన తల్లి మనస్సులో భావలు ఎలా ఉంటాయో ఈ పాటలో చాలా హ్రుద్యమంగా వ్రాశారు పాలగుమ్మి విస్వనాధం. అంత చక్కగానూ పాడారు హైమవతి గారు. విని ఆనందించండి.

Friday 24 April 2015

నేనేమి జేయగలేను నీవు పరిపూర్ణుడవు - అన్నమయ్య కీర్తన



25.4.2015: ఈ వారం అన్నమయ్య కీర్తన:  

ప. నేనేమి జేయగలేను నీవు పరిపూర్ణుడవు
    హీనుడ నే నధికుడ వన్నితానీవు. !!

చ.  దండము బెట్టుట నాది తప్పులో గొనుట నీది.
      నిండి నీవెప్పుడు దయానిధివి గాన,
      అండ జేరుకొంట నాది అందుకు మా కొంట నీది
      దండియైన దేవేదేవోత్తముడవు గాన.

౨.   శరణు  జొచ్చుట నాది సరుగ గాచుట నీది.
      పరమపురుష శ్రీపతివి నీవు,
      విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది
      పోరి నీవు భక్తసులభుడ వటుగాన.

౩.    దాసుడననుట నాది తప్పక ఏలుట నీది
      అసదీర్చే వరదుడ వటుగాన.
       నీ సేవ యొక్కటి నాది నిచ్చలు గైకొంట నీది
       యీసు లేని శ్రీ వేంకటేశుడవు గాన.

భావము:  దేవా! అల్పజీవుడనైన నేనింత కంటే నేమియు చేయజాలను. నీవు పరిపూర్ణ స్వరూపుడవు. నేను ఎట్టి శక్తియు లేని అల్పుడను. నీవు అన్నిటా అధికుడివి.

నీకు దండము పెట్టుట నా పని. నా తప్పులు సైరించి నన్ను మన్నించుట నీ పని. ఏలననగా నీవు ఎల్లప్పుడూ దయానిధివి కదా. నీ అండ చేరుకొనుట నా పని. నా పిలుపు విని నా కోరికలు తీర్చుట నీ పని. ఏలన నీవు దండియైన దేవాదిదేవుడవు కదా.

నిన్ను శరణు జొచ్చుట నా వంతు. నన్ను రక్షించుట నీ వంతు. ఎందుకన, ఓ పరమపురుషా! శరణాగతులను రక్షించమని పురిగోలిపే లక్ష్మీ దేవికి పతివి కదా.. పూలతో పూజించుట నా వంతు. సకలసంపదలొసగుట నీ వంతు. ఎందుకన నీవు భక్తజనులకు సులభుడవు కదా..

నేను నీ దాసుడననుట నా కర్తవ్యము. నన్ను దయచూచి కాపాడుట నీ కర్తవ్యము.  ఏలన నీవు దాసజనుల ఆశలు దీర్చు వరదుడవు కదా! ఈ రీతిగా నిన్ను సేవించుట ఒక్కటే నా పని. నా సేవల నెల్లవేళలా అంగీకరించుటే నీ పని. ఎందుకన నీవు యీసు లేని శ్రీ వేంకటేశ్వరుడవు కదా..

జీవుడు అల్పుడు. దేవుడు అధికుడు. జీవుడు దేవుని సేవింపవలెను. దేవుడు జీవుని కరుణింప వలెను. జీవునికి దేవునికి గల ఈ సంబంధమునే ఈ కీర్తనలో అన్నమయ్య విశదీకరించాడు.

-- పొన్నాడ లక్ష్మి 

Saturday 18 April 2015

నిన్ను నమ్మి విశ్వాసము – నీపై నిలుపుకొని ఉన్నవాడనిక – ఉపాయమేటికి ? - అన్నమయ్య కీర్తన



18.4.2015.ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. నిన్ను నమ్మి విశ్వాసము – నీపై నిలుపుకొని
     ఉన్నవాడనిక – ఉపాయమేటికి ?

౧.   గతియై రక్షింతువో – కాక రక్షించవో యని
      మతిలోని సంశయము – మరి విడిచి,
       ఇతరులచే ముందర – నిక నేట్లౌదునో యని
       వెతతోడ దలచేటి – వెరపెల్లా విడిచి 

౨.    తిరమైన నీ మహిమ - తెలిసేవాడ ననే
       గరువముతోడి వుద్యో -  గము విడిచి,
       వెరపున నీ రూపు – వెదకి కానలే ననే
        గరిమ నలపు నాస్తి – కత్వము విడిచి.
౩.      ద్రువమైన నా చేతకు - తోడుదెచ్చుకో ననే
         ఆవల నన్యులమీది – యాస విడిచి
         వివరిచలమేల్మంగ – విభుడ శ్రీ వెంకటేశ
         తవిలితి నా పుణ్యమం – తయు నీకు విడిచి.  

భావం:  దేవా! నీవే గతియని నమ్ముకొని ణా విశ్వాసమంతయు నీ పైననే నిలుపుకొని యున్నాను. నాకిక వేరే ఉపాయమెందుకు?

నీవే నాకు దిక్కై కాపాడుదువో, కాపాడవో అన్నణా మనస్సులని సందేహమును పూర్తిగా వదిలిపెట్టినాను. తప్పక నీవే కాపాడుదువన్న గట్టినమ్మకముతో ఉన్నాను. ఇకమీదట ఇతరులవలన ఎట్టి అపకారమునకు గురి అగుదునో అన్న భయ మెల్ల విడనాడి నిర్భయముగా నున్నాను.

స్థిరమైన నీ మహిమ నంతయు తెలిసికొన గలనన్న గర్వముతో గూడిన ప్రయత్నము నంతయు త్యజించి నీ మహిమలు ఊహాతీతములని గుర్తించి గర్వరహితుడనై యున్నాను. నీ స్వరూపమును వెదకి కనుగొనజాలనన్న నాస్తిక భావమును విడిచినాను. సంపూర్ణ విశ్వాసముతో నిన్ను సేవించి నీ స్వరూపమును కనుగొనగల నన్న ఆస్తికభావముతో నున్నాను.

నీ సేవారూపమైన శాస్వతకార్యమునకు పరులనుండి సహాయము తెచ్చుకొందు నన్న ఆసను విడనాడి నాకు నేనే ఆత్మోద్ధరణ గావించుకొనుటకు పూనుకొన్నాను. అలమేల్మంగా పతివైన శ్రీ వేంకటేశ్వరా! నిన్ను మనసార తలపోసి సత్కర్మలచే నేనార్జించిన పుణ్యమునంతయును నీకు సమర్పించి నిన్ను ఆశ్రయించినాను. కాన నీవు నన్ను రక్షింపక తప్పదని భావము.

భగవంతునిపై యెంత విశ్వాసము కలిగి యుండవలేనో ఈ కీర్తనలో చక్కగా వివరించబడింది. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానం”అని భగవానుడు ఆనతిచ్చినట్లు శ్రద్ధ గలిగినవాడే జ్ఞానము నొందగలడు. భగవంతునిపై విశ్వాసము గలవాడే రక్షణ పొందగలడు.    
(పొన్నాడ లక్ష్మి)

పూటకూళ్ళు – రెస్టారెంట్లు.



పూటకూళ్ళు – రెస్టారెంట్లు.
క్రీ.శ. 1200 నాటికే మన పోపుదినుసులు ఇంగ్లిష్ ప్రజల్లో స్టేటస్ సింబల్ గా మారాయి. బ్రెడ్ ముక్కలు మీద జామ్ పట్టించడం, పోపు దినుసులతో తయారయిన వంటకాలను నంజుకుని తినడం అలవాటు చేసుకోసాగారు.
క్రీ.శ. 1272 లో మొట్టమొదటి పూటకూళ్ళ ఇల్లు ఇంగ్లండులో ఏర్పడింది. 1309 నాటికి బ్రిటన్ లో ఇలాంటివి 354 ఏర్పడ్డాయట. 1765 లో ఫ్రెంచ్ వాళ్ళు రెస్టారెంట్ వ్యవస్తని ప్రారంభించారు. రెస్ట్+రెంట్ అనేవి ఇందులో ముఖ్యమైనవి.
1600 నాటికే తెలుగు నేలతొ పరిచయాలు పెంచుకున్న ఫ్రెంచ్ వారికి ఇక్కడి పూటకూళ్ళ వ్యవస్తని చూసిన తర్వాతే రెస్టారెంట్ల ఏర్పాటు ఆలోచన వచ్చిందనడం అతిశయోక్తి కాదు.
అక్కలవాడలు, పూటకూళ్ళ ఇళ్ళు పదమూడవ శతాబ్ది నాటికే ఇక్కడ ప్రసిద్ది.  భోజన సౌకర్యంతో పాటు “పడక” సౌకర్యం కూడా ఉన్న పూటకూళ్ళ ఇళ్ళు అక్కలవాడలో ఉండేవి. అక్కలవాదల లో ఓ వంటగత్తె (అందగత్తెని) కుడుర్చుకోనేవారు. “వార్చి వస్తానంటున్నావు-ఎక్కడ వంటకెల్తున్నావో చెప్పవే వనరుహాక్షి ...” అంటుంది క్రీడాభిరామంలో ఒక పాత్ర. “పూటకూళ్ళది పుణ్యమునకు జాలదు” అనే రాయలు వాదన ఇక్కడ గమనార్హం.
“అక్షవాటిక అనే సంస్కృత పదం  అక్కలవాడగా తెలుగులో మారింది. అక్షవాడు అంటే మల్లయుద్ధం జరిగే ప్రదేశం. బహుశా ఆనాటి రెస్టారెంట్లు లేదా “మోటల్స్”  లో ఇలా జిమ్ సౌకర్యం కూడా ఉండేది కాబోలు. అరూవాటిక అంటే జూదం, తాగుడు అవకాశాలు ఉన్న “బార్ లాంటిది” ఇవన్నీ అక్కలవాడ లో లభ్యం.
అనేకమంది అధికారులు, సైనికులు, వ్యాపారులు, రాయబారులు, విదేశీ సంచారులు వీళ్ళంతా రాచనగరుకు వచ్చినప్పుడు ఈ అక్కవాడలు “అన్ని’ అవసరాలు తీర్చేవిగా ఉపయోగపడేవి.
రాయలు తన ఆముక్తమాల్యదలో “తద్దినం భోజనం “ పీకలు దాక తిని అది సరిపోక అక్కలవాడకు వెళ్లి అక్కడ అరకూడు మేక్కినవాడి గురించి వర్ణిస్తాడు. అరకూడు అంటే అరకొరగా వడ్డించిన ‘ప్లేట్ మీల్స్’ అన్నమాట. అలా సరదాగా వచ్చి, తిని పోదలచిన వాళ్లకు పూటకూళ్ళు అక్కలవాడలు ఎంతో సహరించేవి.
మొత్తానికి మన పూతాకూళ్ల వ్యవస్తే రెష్టారెంట్లగా రూపుదిద్దుకున్నాయన్న మాట!
- పొన్నాడ లక్ష్మి 

(సేకరణ: ‘శ్రీ కృష్ణదేవరాయ వైభవం’ గ్రంధం’ లో జీ.వీ. పూర్ణచంద్ గారి వ్యాసం   నుండి)