ఎన్నడు విజ్ఞాన మిక నాకు
విన్నపమిదె శ్రీ వేంకటనాథా బాసిన బాయవు (భవ) బంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు | కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు |
తచ్చిన తగలవు తహతహలు
రచ్చలు విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటికొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా |
సకలము నీవే శరణంటే
ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు ||