Wednesday 29 April 2015

శ్రీకృష్ణ బలరాముల విద్యాభ్యాసం









శ్రీ మద్భాగవతం దశమస్కందం  :  శ్రీ కృష్ణ బలరాముల విద్యాభ్యాసం.
గాయత్రీ దీక్ష తరువాత కృష్ణబలరాములు సాందీపనిముని వద్దకు విద్యాభ్యాసమునకు వెళ్ళినారు. కృష్ణ బలరాముల భక్తి శ్రద్ధలను, నియమనిష్టలనూ చూచి  సంతుష్టుడై వేదరహస్యాలనూ, ఉపనిషత్తులనూ బోధించాడు. క్షత్రియులు కనుక యుద్ధవిద్య, రాజనీతిలో కూడా శిక్షణ ఇవ్వబడింది.  

అంతేకాక సంగీత సాహిత్యాలు, చిత్రలేఖనం, పుష్పాలంకరణ,గృహాలంకరణ, వాస్తు శాస్త్రము మొదలగు చతుషష్టి కళలనూ అభ్యసించారు. నాటకరంగములో వస్త్రాలంకరణ, కేశాలంకరణ,మొగమునకు చందనమూ మొదలగు పూతలుపూసి అందంగా అలంకరించడం(అంటే ఇప్పటి beautician  course అన్నమాట) ఇలా ఎన్నోవిద్యలను నేర్చుకున్నారు.  బహురూపి కళను నేర్చుకున్నారు. ఈ కళలో సన్నిహితులు కూడా గుర్తించ లేనట్లుగా వేషధారణ చేయగలుగుతారు. అంతే కాక మనస్తత్వ శాస్త్రం, ఇంద్రజాలం, వశీకరణ విద్య మొదలగు విద్యలన్నీ అభ్యసించారు.

పోడుపుకధలల్లడం,  గడి నుడి నుడి కట్టులో పదాలను నింపడం కూడా నేర్చుకున్నారు. వివిధ దేశాల  భాషలు నేర్చుకోవడమే గాక, శ్రీ కృష్ణుడు  జంతువులతో, పక్షులతో కూడా మాట్లాడేవాడు. గోస్వాముల విరచితమైన వైష్ణవ  సాహిత్యంలో దీనికి నిదర్సనం కూడా కనిపిస్తుందిట. ఇంకా ఎన్నో ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన విద్యలూ, కళలూ అతి స్వల్పకాలంలో నేర్చుకుని తమగురువుని సంత్రుప్తిపరిచారు.
ఈ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న కళలన్నీ (beautician course, magician course, psychology, hypnotism, wall paintng, vaastu, crossword pujjle, house decoration etc.) కొన్నివేల సంవత్సరాల క్రితం కృష్ణుడు
అభ్యసించాడంటే అద్భుతంగా లేదూ...!!!

No comments:

Post a Comment